ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ నర్మగర్భ పోస్ట్.. నెక్స్‌ట్ జరగబోయేది ఇదేనా..

ABN, First Publish Date - 2023-01-01T21:40:45+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్ట్ ట్రంప్‌కు సొంత పార్టీని కాదని మూడో పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు అమెరికా మీడియా చెబుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా(USA) మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్ట్ ట్రంప్‌కు(Donald Trump) సొంత పార్టీలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా.. ? పార్టీ నేతల మద్దతు కోల్పోతున్నారా.. మూడో పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో నిలబడనున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో(2024 Presidential Elections) దిగేందుకు రెడీ అవుతున్న ట్రంప్..తాజాగా ఓ నర్మగర్భ పోస్ట్ పెట్టారు. ది కమింగ్ స్ప్లిట్(రాబోయే చీలిక) పేరిట ఉన్న ఓ ఆర్టికల్‌ను ఆయన తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు.‘‘మూడో పార్టీ తరపున ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారా అంటే లేదనే సమాధానమిస్తా..కానీ నేను ఆయనకే ఓటేస్తా’’ అంటూ వ్యాసరచయిత తన ఆర్టికల్‌లో పేర్కొన్నారు.

2022 మొదట్లో ట్రంప్‌కు పరిస్థితులు అన్నీ అనుకూలించినట్టు కనిపించినా..డిసెంబర్ నాటికల్లా సీన్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. ఒకప్పుడు ఆయన మద్దతు కోసం క్యూ కట్టిన రిపబ్లికన్ పార్టీ నేతలు క్రమంగా దూరమవుతున్నారు. ట్రంప్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా.. గత నవంబర్‌లో జరిగిన మిడ్ టర్న్ ఎన్నికల్లో ట్రంప్ మద్దతిచ్చిన పలువురు నేతలు ఓటమి చవిచూశారు. వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగుతానన్న ట్రంప్ ఇప్పటివరకూ ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. మరోవైపు ట్రంప్ రాజకీయ ప్రత్యర్థిగా పేరుపడ్డ ప్లోరిడా గవర్నర్ డిషాంటిస్‌కు పార్టీలో మద్దతు పెరుగుతోంది. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన నిలబడే అవకాశం అధికమవుతోంది.

Updated Date - 2023-01-01T21:44:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising