ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel Hamas War: విషాదం.. హమాస్ నగ్నంగా ఊరేగించిన ఆ యువతి ఇక లేదు

ABN, First Publish Date - 2023-10-31T18:42:41+05:30

అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులకు పాల్పడిన హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భూమి, వాయు, జల మార్గాల ద్వారా ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ యోధులు..

అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులకు పాల్పడిన హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భూమి, వాయు, జల మార్గాల ద్వారా ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ యోధులు.. వందలాది మందిని వెంటాడి మరీ చంపడంతో పాటు మరికొందరిని అపహరించుకుపోయారు. ఈ క్రమంలో వాళ్లు చాలా దారుణాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా.. మహిళలపై పట్ల కర్కశంగా ప్రవర్తించారు. అత్యాచారం చేయడం, ఎదురుతిరిగితే అక్కడే చంపేయడం వంటి క్రూర పనులు చేశారు. ఇప్పుడు తాజాగా ఒక మహిళ పట్ల వాళ్లు అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వచ్చింది.


ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ యోధులు.. సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్ట్ వద్ద మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడి పారిపోవడానికి ప్రయత్నించిన వారిపై కాల్పులు జరిపి అన్యాయం చంపేశారు. తమ చేతికి చిక్కిన వారిని కిడ్నాప్ చేశారు. అలా.. హమాస్ చేతిలో కిడ్నాప్‌కు గురైన వారిలో జర్మనీకి చెందిన షానీ లౌక్ అనే యువతి కూడా ఉంది. హమాస్ యోధులు ఆమెను నగ్నంగా నగరమంతా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి కూడా! ఇప్పుడు ఆ యువతి తుదిశ్వాస విడిచింది. ఈ వ్యవహారంపై తాజాగా ఆమె తల్లి రికార్డా లౌక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ తమ కూతురు బతికే ఉందన్న ఆశ ఉండేదని, కానీ దురదృష్టవశాత్తూ ఆమె చనిపోయిందన్న వార్త ఇజ్రాయెల్ సైన్యం నుంచి అందిందని ఆమె చెప్పారు.

హమాస్ దాడుల్లో తన కుమార్తో తీవ్రంగా గాయపడి, గాజాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు మొదట తమకు సమాచారం అందిందని.. కానీ ఇంతలోనే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన విషయం తెలిసి జీర్ణించుకోలేకపోతున్నానని రికార్డా లౌక్ భావోద్వేగానికి లోనయ్యారు. అటు.. షానీ లౌక్ సోదరి సైతం ఆమె మరణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ధృవీకరించింది. కాగా.. షానీ లౌక్‌కు జర్మనీ, ఇజ్రాయెల్ ద్వంద్వ పౌరసత్వం ఉంది. కానీ.. ఆమె ఎప్పుడూ జర్మనీలో నివసించలేదు. కేవలం బంధువుల్ని కలవడానికి వెళ్తుండేది. జర్మనీలో కాథలిక్కులను విశ్వసించే ఆమె తల్లి రికార్డా.. ఇజ్రాయెల్‌కు వలస వచ్చాక జుడాయిజాన్ని అనుసరించడం ప్రారంభించారు.

Updated Date - 2023-10-31T18:43:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising