ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hamas Israel War: హమాస్, ఇజ్రాయెల్ వార్‌లో కొత్త ట్విస్ట్.. 2014 నుంచే హమాస్ పక్కా ప్లానింగ్.. పట్టించుకోని ఇజ్రాయెల్

ABN, First Publish Date - 2023-10-08T16:13:37+05:30

శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్‌ ఆల్‌-అఖ్సా స్టార్మ్‌’ పేరుతో చేసిన ఈ దాడుల కోసం హమాస్ 2014లోనే...

శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్‌ ఆల్‌-అఖ్సా స్టార్మ్‌’ పేరుతో చేసిన ఈ దాడుల కోసం హమాస్ 2014లోనే ఏర్పాట్లు చేసుకున్నట్టు తాజాగా వెల్లడైంది. ఇజ్రాయెల్ షాక్‌కు గురయ్యేలా ఊహించని దాడులు చేయాలని హమాస్ పక్కా ప్లానింగ్ చేసుకుందని.. కొందరు యోధుల్ని విదేశాలకు పంపి మరీ ప్రత్యేక శిక్షణ ఇప్పించిందని తేలింది. అసలు ఈ దాడుల్లో హమాస్ గ్రూపు మోటారైజ్డ్ పారాగ్లైడర్లను వినియోగిస్తుందన్నది అతిపెద్ద ట్విస్ట్. గాల్లో నుంచి వీళ్లు దూసుకొచ్చి, సరిహద్దు కంచెలు దాటి.. ఇజ్రాయెల్ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వీరిలో ఆత్మాహుతి బృందానికి చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత వీళ్లు శిక్షణ పొందుతున్న వీడియోని సోషల్ మీడియాలో హమాస్ పోస్ట్ చేసింది.

నిజానికి.. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసేందుకు హమాస్ కుట్ర పన్నుతోందని 2014లోనే నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో.. ఇజ్రాయెల్ బలగాలు రంగంలోకి దిగారు. దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ అనే ప్రదేశంలో ఒక హమాస్‌ కమాండర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. మొదట్లో అతడు సమాచారం తెలిపేందుకు నిరాకరించాడు. కానీ.. ఇజ్రాయెల్ బలగాలు తమదైన శైలిలో విచారించగా, అతడు చాలా విషయాలు బయటపెట్టాడు. 2010లోనే హమాస్ గ్రూపు తనతో పాటు మరో 10 మందికి మలేసియాలో పారాగ్లైడింగ్‌లో శిక్షణ ఇప్పించిందని చెప్పాడు. పారాచూట్ సహాయంతో ఇజ్రాయెల్‌లో దిగి.. అక్కడి ప్రజలు, సైనికులను కిడ్నాప్‌ చేయడానికి హమాస్ పథకం రచించిందని కూడా అతడు పేర్కొన్నాడు. అనంతరం మరింత లోతుగా విచారణ చేపట్టగా.. గాజా స్ట్రిప్‌లోనే పారాగ్లైడింగ్‌ శిక్షణ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.


అయితే.. ఆ సమయంలో దాడులకు పారాగ్లైడర్స్‌ని హమాస్ వాడకపోవడంతో, ఇజ్రాయెల్‌ దళాలు తేలిగ్గా తీసుకొన్నాయి. కానీ.. తాజా దాడుల్లో భాగంగా హమాస్ అనూహ్యంగా మోటారైజ్డ్ పారాగ్లైడర్స్‌ని ఇజ్రాయెల్‌లోకి పంపించడంతో ఇజ్రాయెల్ సైనికులు ఖంగుతిన్నారు. ఒకవేళ వీళ్లు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకపోయి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదేమో. ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకొచ్చిన పారాగ్లైడర్లు వందల సంఖ్యలోనే ఉంటారని, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్లు పట్టణాల్లో దిగి.. దొరికిన పౌరులు, సైనికులను బందీలుగా పట్టుకొన్నారు. అటు.. మధ్యదరా సముద్రం నుంచి చిన్నచిన్న బోట్లలో ఇజ్రాయెల్‌లోకి అడుగుపెట్టారు. పికప్‌ ట్రక్కుల్లోనూ భారీ మెషీన్‌ గన్లతోనూ దూసుకొచ్చారు. భూ, వాయు, జల మార్గాల్లో ఏకకాలంలో హమాస్‌ దాడి చేస్తుందని.. ఇజ్రాయెల్‌ దళాలు అస్సలు ఊహించలేకపోయాయి.

మరోవైపు.. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన ఈ మెరుపుదాడిలో రష్యా హస్తం కూడా ఉండొచ్చన్న అనుమానాలను రాబర్ట్‌ లాన్సింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యక్తం చేసింది. ఎందుకంటే.. రష్యా వద్ద ఇప్పటికే పారాగ్లైడింగ్ దళాలు ఉన్నాయి. హమాస్ వాడిన పారాగ్లైడింగ్స్‌కి వాటితో కొన్ని పోలికలు ఉన్న తరుణంలో.. రష్యా హస్తం తప్పకుండా ఉండొచ్చని భావిస్తున్నారు. దీనికితోడు.. పాలస్తీనాకు రష్యా మద్దతు ఎప్పటినుంచో ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత.. పాలస్తీనా, లెబనాన్‌ నుంచి యువతను రష్యా తీసుకెళ్లింది. దీనికి ప్రతిగా రష్యా నుంచి హమాస్‌ దళాలకు మద్దతు లభించినట్లు అనుమానిస్తున్నారు.

Updated Date - 2023-10-08T16:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising