ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో షాకింగ్ ట్విస్ట్.. హమాస్ వద్ద రసాయన ఆయుధాలు.. తెరవెనుక అల్‌ఖైదా!

ABN, First Publish Date - 2023-10-23T17:06:55+05:30

అక్టోబర్ 7వ తేదీన మొదలైన ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలుత హమాస్ ఈ యుద్ధానికి శంఖం పూరించగా.. ఇజ్రాయెల్ అందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది. హమాస్‌ని పూర్తిగా...

అక్టోబర్ 7వ తేదీన మొదలైన ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలుత హమాస్ ఈ యుద్ధానికి శంఖం పూరించగా.. ఇజ్రాయెల్ అందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది. హమాస్‌ని పూర్తిగా సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో ముందుకు దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌లో భారీ విధ్వంసం సృష్టించాలన్న ఉద్దేశంతోనే హమాస్ దాడులు చేసిందని, రసాయన ఆయుధాలు ప్రయోగించేందుకు కూడా సిద్ధమైందని తేలింది. ఓ హమాస్ సాయుధుడి వద్ద దొరికిన ఆధారాలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ అంశంపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరించే పూర్తి సమాచారం హమాస్‌ మిలిటెంట్ల వద్ద ఉందని చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలను వాళ్లు ఉగ్రవాద సంస్థ అల్‌ ఖైదా నుంచి పొందారని తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన ఓ హమాస్‌ సాయుధుడి మృతదేహం వద్ద ‘సైనైడ్‌ డిస్పర్షన్‌ డివైజ్‌’ను ఎలా వాడాలో వివరించే యూఎస్‌బీ దొరికిందని అన్నారు. ఇది అల్‌ ఖైదా మెటీరియల్ అని నొక్కి చెప్పారు. అలాగే.. మరో ఉగ్రవాద సంస్థ అయిన ఐసిస్‌కు సంబంధించిన పత్రాలు, జెండాలు కూడా హమాస్ ఉగ్రవాదుల మృతదేహాల వద్ద లభించాయన్నారు. చూస్తుంటే తాము ఒక్క హమాస్‌తోనే కాదని.. అల్ ఖైదా, ఐసిస్‌తోనూ పోరాడుతున్నట్టు అర్థమవుతోందని చెప్పుకొచ్చారు.


తాము ఆ యూఎస్‌బీని పరిశీలిస్తున్నప్పుడు.. అందులో రసాయన ఆయుధాలను ఎలా ఆపరేట్ చేయాలి? సైనేడ్‌తో నాన్-ప్రొఫెషనల్ రసాయన ఆయుధాన్ని ఎలా సృష్టించాలి? అనే సూచనల్ని తాము చూశామన్నారు. అది చూస్తున్నప్పుడు తాము షాక్‌కి గురయ్యామన్నారు. ప్రాథమిక పాఠశాలలు, యూత్‌ సెంటర్ల వంటి వాటిని లక్ష్యంగా చేసుకొని.. వీలైనంత ఎక్కువ మందిని చంపడమో లేదా బందీలుగా చేసుకోవమో చేయాలని ఆ యూఎస్‌బీలో ఉందని వివరించారు. వీటికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా ఆయన బయటపెట్టారు. అటు.. హమాస్ రసాయన ఆయుధాలను ఉపయోగించేందుకు ప్రయత్నించిందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలకు క్లాసిఫైడ్ కేబుల్‌ను పంపింది.

ఇదిలావుండగా.. తొలుత హమాస్ ఈ యుద్ధ బేరి మోగించింది. నిమిషాల వ్యవధిలో 5 వేలకు పైగా రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడిలో వందలాది మంది మరణించారు. అంతేకాదు.. భూమి, వాయు, జల మార్గాల ద్వారా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి, వందలాది మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో మండిపడ్డ ఇజ్రాయెల్.. హమాస్‌తో యుద్ధం ప్రకటించి, ఆ సంస్థను తుడిచిపెట్టేయాలన్న లక్ష్యంతో దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే హమాస్‌కి చెందిన ఎన్నో రహస్య స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఆహారం, ఇంధనం, విద్యుత్‌లపై నిషేధం విధించి.. గాజాను దిగ్బంధించింది. త్వరలోనే గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు కూడా ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతోంది.

Updated Date - 2023-10-23T17:06:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising