ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India-America: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్‌కి ఆ స్వేచ్ఛ ఉందంటూ అమెరికా కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-11-09T20:03:25+05:30

Israel Hamas War: అమెరికాకు భారతదేశం వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా నిర్దిష్ట అంశంపై (సంక్షోభం లేదా ఆకస్మిక పరిస్థితులు) తన వైఖరిని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని వైట్ హౌస్ తెలిపింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో..

అమెరికాకు భారతదేశం వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా నిర్దిష్ట అంశంపై (సంక్షోభం లేదా ఆకస్మిక పరిస్థితులు) తన వైఖరిని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని వైట్ హౌస్ తెలిపింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై (ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ) ఎలాంటి వైఖరి అనుసరించాలన్నది భారత్ ఇష్టమేనని పేర్కొంది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు. ‘ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనాతోనూ భారత్‌కి మంచి సంబంధాలున్నాయి కాబట్టి.. హమాస్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందా?’ అనే ప్రశ్నకు జాన్ కిర్బీ ఆ వ్యాఖ్యలు చేశారు.


‘‘యునైటెడ్ స్టేడ్స్‌కి భారతదేశం కీలక వ్యూహాత్మక భాగస్వామి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకి వచ్చినప్పుడు.. ఇరుదేశాల మధ్య ఎంతటి బలమైన బంధం ఉందో అందరూ గమనించే ఉంటారు. అయితే.. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా నిర్దిష్ట సంక్షోభం లేదా ఆకస్మిక పరిస్థితులపై తన వైఖరి ఏంటో నిర్ణయించుకునే హక్కు ఆ దేశానికి, ప్రధాని మోదీకే వదిలేస్తాం. భారత్ మాకెప్పుడూ వ్యూహాత్మక భాగస్వామినే. మేము ఆ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అంకితభావంతో ఉన్నాం’’ అని కిర్బీ చెప్పుకొచ్చారు.

ఇదిలావుండగా.. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇజ్రాయెల్‌కి పూర్తి మద్దతు తెలిపింది. అయితే.. ఈ యుద్ధం రానురాను మరింత ముదురుతుండటం, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల కారణంగా గాజాలోని పౌరులు అన్యాయంగా మరణిస్తుండటంతో.. భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడి నుంచి గాజాకు మానవతా సహాయాన్ని కూడా పంపించింది. ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు పిలుపునిచ్చింది. కానీ.. ఇజ్రాయెల్ మాత్రం హమాస్‌ని అంతం చేయాలన్న లక్ష్యంతో తన దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది.

Updated Date - 2023-11-09T20:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising