ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

G-20 Summit: నేడు జీ - 20 వర్చువల్ సమ్మిట్.. అజెండాలో కీలక అంశాలు

ABN, First Publish Date - 2023-11-22T08:54:51+05:30

ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారమే టార్గెట్‌గా దేశాధినేతలు నేడు భారత్(India) నిర్వహించనున్న జీ - 20(G - 20 Virtual Summit) సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) మీటింగ్ ని ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

ఢిల్లీ: ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారమే టార్గెట్‌గా దేశాధినేతలు నేడు భారత్(India) నిర్వహించనున్న జీ - 20(G - 20 Virtual Summit) సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) మీటింగ్ ని ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

గతేడాది సెప్టెంబర్ లో భారత్ అధ్యక్షతన జరిగిన జీ 20 వార్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం వచ్చిన ఫలితాలు, చర్యల ఆధారంగా అజెండా రూపొందించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ఇందులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్- హమాస్(Israeil - Hamas) వివాదం, ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక స్థితి పునరుద్ధరణ, ఢిల్లీ డిక్లరేషన్ తదితర అంశాలపై చర్చించేందుకు నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారు.


చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్( Xi Jinping) బదులు ప్రీమియర్ లీ కియాంగ్ ఆ దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఆర్థిక పునరుజ్జీవనానికి దోహదపడేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని చైనా ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. వర్చువల్ సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రకటించింది.

సెప్టెంబరులో జరిగిన ఢిల్లీ G20 సమ్మిట్‌లో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ రష్యా నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో ఉక్రెయిన్ పై దృష్టి పెట్టాల్సి రావడంతో పుతిన్ హాజరుకాలేకపోయారు. అంతకుముందు జరిగిన జీ - 20 బాలి సదస్సుకు కూడా పుతిన్ దూరమయ్యారు.

ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడేలా ఈ సమావేశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మాట్లాడుతూ.. చాలా మంది జీ - 20 సమావేశంలో హాజరుకానున్నట్లు తెలిపారు. దేశాధినేతలంతా కొన్ని సమష్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. గాజాలో మానవతా సంక్షోభంపై బ్రిక్స్ సమావేశానికి ముందే అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-11-22T08:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising