ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel-Hamas War: మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపించాలి.. అమెరికాపై ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-11-11T17:08:13+05:30

Israel-Hamas War: హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఈ యుద్ధం ప్రారంభమై నెల రోజుల పైనే అవుతున్నా.. ఇరు వర్గాల మధ్య పోరు సాగుతూనే ఉంది. ముఖ్యంగా.. హమాస్‌ని అంతం చేయాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ దూసుకుపోతోంది.

హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఈ యుద్ధం ప్రారంభమై నెల రోజుల పైనే అవుతున్నా.. ఇరు వర్గాల మధ్య పోరు సాగుతూనే ఉంది. ముఖ్యంగా.. హమాస్‌ని అంతం చేయాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ దూసుకుపోతోంది. వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేషన్స్‌తో హమాస్‌ని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఈ యుద్ధాన్ని ఆపాలని అరబ్ దేశాలు పిలుపునిస్తున్నాయి. అమెరికాని సైతం అభ్యర్థిస్తున్నాయి. కానీ.. ప్రయోజనం మాత్రం శూన్యం. ఇలాంటి తరుణంలో ఇరాన్ తాజాగా అమెరికాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ యుద్ధాన్ని అమెరికానే కొనసాగిస్తోందంటూ కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అరబ్, ఇస్లామిక్ దేశాలు సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఓ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాల్గొన్నారు. అయితే.. ఈ సదస్సుకు బయలుదేరడానికి ముందే ఆయన టెహ్రాన్ విమానాశ్రయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించాలంటే.. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని, కేవలం మాటలు సరిపోవని అన్నారు. ఇందుకు ఇస్లామిక్ దేశాల ఐక్యత ముఖ్యమని తెలిపారు. అంతేకాదు.. సౌదీ అరేబియాలో నిర్వహించిన శిఖరాగ్ర సమావేశం యుద్ధోన్మాదులకు (యుద్ధాన్ని విస్తరింప చేసే వాళ్లకు) బలమైన సందేశాన్ని పంపుతుందని, దాని ప్రభావం పాలస్తీనాపై దాడుల విరమణకు దారి తీస్తుందని చెప్పారు.

యుద్ధాన్ని పొడిగించడం తమకు ఇష్టం లేదని, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నందుకు వెంటనే దీనికి పరిష్కారం ఆలోచించాలని అమెరికా చెబుతోందని.. ఈ సందేశాన్ని ఇరాన్‌తో పాటు అనేక దేశాలకు పంపిందని ఇబ్రహీ రైసీ పేర్కొన్నారు. అయితే.. అమెరికా చర్యలు మాత్రం ఆ ప్రకటనకు అనుగుణంగా లేవని కుండబద్దలు కొట్టారు. ‘‘గాజాలో యుద్ధం కొనసాగించాలా? లేక నిలిపివేయాలా? అనేది అమెరికా చేతుల్లోనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. గాజాలో దాడుల్ని కొనసాగించేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా సహాయం చేస్తోంది. అమెరికా నిజస్వరూపాన్ని ప్రపంచ దేశాలు గమనించాలి’’ అని రైసీ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-11-11T17:08:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising