ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Iran : ఇరాన్‌లో ప్రబలుతున్న పైశాచికత్వం... బడికెళ్లే బాలికలపై అత్యంత దారుణం...

ABN, First Publish Date - 2023-02-28T18:34:34+05:30

ఇరాన్‌లో బాలికల పాఠశాలలను మూసివేయించాలనే దురుద్దేశంతో కొందరు అత్యంత పైశాచికత్వంతో వ్యవహరిస్తున్నారని ఆ దేశ డిప్యూటీ

Iranian girl students
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : ఇరాన్‌లో బాలికల పాఠశాలలను మూసివేయించాలనే దురుద్దేశంతో కొందరు అత్యంత పైశాచికత్వంతో వ్యవహరిస్తున్నారని ఆ దేశ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ యూనస్ పనహి (Younes Panahi) ఇటీవల చెప్పారు. కోమ్ (Qom)లో బడికి వెళ్లే బాలికలకు విషం ఇస్తున్నారని తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. అన్ని పాఠశాలలను, మరీ ముఖ్యంగా బాలికల పాఠశాలలను మూసివేయించాలనే కుట్ర దీని వెనుక ఉందని చెప్పారు.

గత ఏడాది నవంబరు నుంచి వందలాది మంది బాలికలు శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రులకు వెళ్తున్నారు. ముఖ్యంగా కోమ్ పట్టణంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. వీరిలో కొందరిని ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స చేయవలసి వస్తోంది. ఫిబ్రవరి 14న కొందరు విద్యార్థినుల తల్లిదండ్రులు గవర్నరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తమ బిడ్డలకు ఈ విధంగా ఎందుకు జరుగుతోందో తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఫిబ్రవరి 15న ప్రభుత్వ ప్రతినిధి అలి బహదూరి జహ్రూమీ మాట్లాడుతూ, బాలికలకు విషం ఎవరు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? అనే అంశాలపై విద్య, నిఘా మంత్రిత్వ శాఖలు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. అనంతరం ప్రాసిక్యూటర్ జనరల్ మహమ్మద్ జఫర్ మోంటాజెరి జ్యుడిషియల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.

ఇరాన్‌లో మహసా అమిని (22) అనే ముస్లిం యువతి కస్టడీలో మరణించడంతో గత ఏడాది పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆమె సక్రమంగా హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ పోలీసులు ఆమెను కొట్టారని, ఆమె మరణానికి అదే కారణమని నిరసనకారులు ఆరోపించారు. హిజాబ్ ధరించాలని నిర్బంధించడం సరికాదని వీరు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు విషం ఇస్తున్నట్లు బయటపడింది.

ఇవి కూడా చదవండి :

PM Modi : విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పెను మార్పులు : మోదీ

United Nations : నిత్యానంద దేశం ‘కైలాస’ ప్రతినిధి ఐరాస సమావేశానికి హాజరు!

Updated Date - 2023-02-28T18:34:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!