ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel vs Palestine: ఇజ్రాయెల్ చేసిన అరాచకాలేంటో తెలుసా.. 56 ఏళ్లలో 10 లక్షల పాలస్తీనియన్లపై అమానుషం

ABN, First Publish Date - 2023-10-09T16:10:29+05:30

ప్రస్తుతం ఇజ్రాయెల్, గాజాలోని హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. తొలుత హమాస్ 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించి, ఇజ్రాయెల్‌తో యుద్ధానికి..

ప్రస్తుతం ఇజ్రాయెల్, గాజాలోని హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. తొలుత హమాస్ 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించి, ఇజ్రాయెల్‌తో యుద్ధానికి శంఖం పూరించింది. భూమి, వాయు, జల మార్గాల ద్వారా మెరుపుదాడి చేసి.. ఇజ్రాయెల్‌కి ఊహించని ఝలక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ సైనికుల్నే కాదు.. అక్కడి పౌరుల్ని సైతం బంధీలు చేశారు. అటు.. ఇజ్రాయెల్ సైతం హమాస్‌పై యుద్ధం ప్రకటించి, ఎదురుదాడులకు దిగింది.

అయితే.. ఈ యుద్ధంలో హమాస్‌దే తప్పు ఉందని, ఇజ్రాయెల్ పౌరులపై అరాచకాలకు పాల్పడుతోందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. కానీ.. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ పాల్పడిన అఘాయిత్యాల గురించి ఎవ్వరూ నోరు మెదపడం లేదు. ఆ దేశం కూడా తక్కువేం కాదు, ఎన్నో ఘోరాలకు పాల్పడింది. పాలస్తీనియన్లకు నరకం చూపిస్తోంది. వారిపై అరాచకాలకు పాల్పడుతూ.. పైశాచికానందం పొందుతోంది. అవును.. గత 56 ఏళ్లుగా ఏకంగా 10 లక్షల పాలస్తీనియన్లను బంధీలుగా చేసిందంటే, ఇజ్రాయెల్ పాపాల పుట్ట ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పాలస్తీనియన్లపై ఆ దేశం ఏవేవో చట్టాలు అమలు చేస్తూ.. వారి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.


ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 1967 నుండి తూర్పు జెరూసలేం, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్‌లను ఇజ్రాయెల్ ఆక్రమించింది. గత 56 ఏళ్లలో 10 లక్షల పాలస్తీనియన్లను అరెస్ట్ చేసింది. ప్రతీ ఐదుగురు పాలస్తీనియన్లలో ఒకరిని అరెస్ట్ చేసి.. వారిపై 1600 సైనిక ఆర్డర్ కింద అభియోగాలు మోపింది. ఇజ్రాయెల్ సైనిక ఆక్రమిత ప్రాంతంలో నివసిస్తున్న పాలస్తీనియన్ల జీవితంలోని ప్రతి అంశాన్ని నియంత్రిస్తోంది. పాలస్తీనా పురుషుల ఖైదు రేటుని రెట్టింపు చేసింది. అమెరికాలోని నల్లజాతి అమెరికన్ల ఖైదు రేటుతో పోలిస్తే.. ఇజ్రాయెల్‌లో మూడు రెట్లు ఎక్కువ. పాలస్తీనియన్లకు స్వతంతంగా జీవించే హక్కు ఇజ్రాయెల్ కల్పించడం లేదు.

ఇజ్రాయెల్ జైలు వ్యవస్థ అనేది పాలస్తీనియన్లను నిర్మూలించడానికి రూపొందించబడిన ఒక భయంకరమైన యంత్రం అని పాలస్తీనా ఖైదీల హక్కుల సంఘం ‘అడ్డమీర్’ పేర్కొంది. 1967 యుద్ధంలో పాలస్తీనా, అరబ్ ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్న రెండు నెలల తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘మిలిటరీ ఆర్డర్ 101’ను జారీ చేసింది. దీని ప్రకారం.. నిరసనల్లో పాల్గొనడం, జెండాలతో పాటు ఇతర రాజకీయ చిహ్నాలను ఊపడం వంటి కార్యకలాపాలు చట్టవిరుద్ధం. మరో ఐదేళ్ల తర్వాత ఇజ్రాయెలో 378 అనే మరో సైనిక ఉత్వర్వు జారీ చేసి.. ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా అన్ని రకాల పాలస్తీనా ప్రతిఘటనల్ని ఉగ్రవాదంగా ముద్ర వేసింది.

ఒకవేళ ఎవరైనా రాళ్లు రువ్వితే.. వారిని 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించేలా ఇజ్రాయెల్ కఠిన చర్యలు తీసుకొచ్చింది. తమ ప్రియమైన వ్యక్తుల్ని సైతం కలవడానికి ఇజ్రాయెల్ అనుమతి ఇవ్వదు. ఏదైనా కేసులో పట్టుబడితే.. దాని విచారణ కొనసాగనివ్వకుండా ఎక్కువకాలం జైలులోనే బందీలుగా ఉంచుతోంది. ఇజ్రాయెల్‌లోని 19 జైళ్లలో, అలాగే ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఒక జైలులో పాలస్తీనా ఖైదీలే ఉన్నారు. 18 ఏళ్ల కూడా నిండని 12 వేల మందికి పైగా పాలస్తీనా పిల్లల్ని అరెస్ట్ చేసిందంటే.. ఇజ్రాయెల్ పాలన ఎంత ఘోరమైందో మీరే అర్థం చేసుకోండి. అందుకే.. హమాస్ లాంటి మిలిటెంట్ గ్రూపులు పుట్టుకొచ్చి, దాడులు చేస్తున్నాయి.

Updated Date - 2023-10-09T16:10:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising