ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel Hamas War: ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం.. ఆ విధానానికి స్వస్తి.. ఈ దెబ్బతో హమాస్ కొంప కొల్లేరే!

ABN, First Publish Date - 2023-10-11T15:20:49+05:30

హమాస్ (పాలస్తీనా ఉగ్రవాద సంస్థ) తమపై మెరుపుదాడి చేయడం, ఎందరో ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా గాజాకు తీసుకెళ్లడంతో తీవ్ర కోపాద్రిక్తులైన ఇజ్రాయెల్ దేశం.. ఎట్టి పరిస్థితుల్లోనైనా ‘హమాస్’ని మట్టుబెట్టాలని...

హమాస్ (పాలస్తీనా ఉగ్రవాద సంస్థ) తమపై మెరుపుదాడి చేయడం, ఎందరో ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా గాజాకు తీసుకెళ్లడంతో తీవ్ర కోపాద్రిక్తులైన ఇజ్రాయెల్ దేశం.. ఎట్టి పరిస్థితుల్లోనైనా ‘హమాస్’ని మట్టుబెట్టాలని కఠిన నిర్ణయం తీసుకుంది. గాజాలోని వారి రహస్య స్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేసి.. హమాస్ ఉనికి లేకుండా చేయాలని పూనుకుంది. ఇందులో భాగంగానే.. ఇజ్రాయెల్ దళాలు (ఐడీఎఫ్) ‘నాక్‌ ఆన్‌ ది రూఫ్‌’ అనే విధానానికి మంగళం పాడేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం.. గాజాలో భారీగా రక్తపాతం తప్పదు. అంటే.. హమాస్ మిలిటెంట్లనే కాదు, గాజావాసుల్ని కూడా లెక్కచేయకుండా ఇజ్రాయెల్ దళాలు నరమేధం సృష్టిస్తారు.


అసలు ఏంటి ఈ ‘నాక్ ఆన్ ది రూఫ్’ విధానం?

2006లో హమాస్ గ్రూపు ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్‌ను ఒక సొరంగ మార్గం ద్వారా కిడ్నాప్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్ దళాలు (ఐడీఎఫ్).. ఆ సొరంగం ఉన్న ఇంటిపై దాడి చేశాయి. అనంతరం ఆ సొరంగాన్ని పూడ్చేశాయి. అప్పుడు హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు సాగింది. ఆ యుద్ధ సమయంలోనే ఐడీఎఫ్ ‘హమాస్’ రహస్య స్థావరాల వివరాల్ని సేకరించి.. ‘ఆపరేషన్‌ క్యాస్ట్‌ లీడ్‌’ను ప్రారంభించింది. సుమారు 170 లక్ష్యాల్ని గుర్తించి.. భారీ సంఖ్యలో ఫైటర్‌ జెట్‌లు, హెలికాప్టర్‌ గన్‌షిప్‌లతో ఐడీఎఫ్ దాడి చేసింది. ఈ దాడుల్లో హమాస్ మిలిటెంట్లతో పాటు 200 మంది గాజావాసులు కూడా మరణించారు. దీంతో.. ఐక్యరాజ్య సమితి నిజనిర్ధారణ కమిటీ ఇజ్రాయెల్‌ యుద్ధనేరాలకు పాల్పడిందని ఆరోపింది.

అదే టైంలో గాజా లోపల ఏం జరుగుతోందో ఇజ్రాయెల్‌కు తెలియదు. కేవలం సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ పైనే ఆధారపడాల్సి వచ్చింది. అప్పుడు.. షిన్‌ బెట్ (ఇజ్రాయెల్‌ అంతర్గత సెక్యూరిటీ సంస్థ), ఐడీఎఫ్ కలిసి దాడులు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించాయి. అంటే.. అక్కడ గాజా పౌరులు ఉన్నారా? లేదా? అని నిర్ధారించుకొని, దాడులు చేసేలా ప్లాన్ చేశాయి. ఎక్కడైతే హమాస్ ఉగ్రవాదులుంటారో.. అక్కడ హెచ్చరికలు లేకుండా దాడి చేసేవారు. అదే హమాస్ మూకలు తలదాచుకున్న ప్రాంతాల్లో గాజా పౌరులున్నారని తెలిస్తే.. ఐదు నిమిషాల ముందు దాడి చేస్తున్నామని హెచ్చరించేవారు. అక్కడి నుంచి గాజావాసులు పోయారని తెలిశాకే ఐడీఎఫ్ దాడులు చేసేది. దీన్ని నాక్ ఆఫ్ ది రూఫ్ అంటారు. ఈ విధానం వల్ల సామాన్య పౌరుల మరణాలు తగ్గాయి.


అయితే.. ఈ విధానాన్ని హమాస్ ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రజలు ఉన్న ఇళ్లల్లో తలదాచుకొని, ఆ ఇంటి యజమానులు అక్కడి నుంచి పారిపోకుండా చర్యలు తీసుకుంటే.. ఐడీఎఫ్ దాడి చేయదని ఉగ్రవాదులు భావించారు. గతంలో ఇలాగే వీరి ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఒక ఇంట్లో హమాస్ మూకలు తలదాచుకోగా, ఆ ఇంటి యజమాని తన ఇళ్లు ఖాళీ చేయకుండా అక్కడే ఉండిపోయాడు. అప్పుడు ఐడీఎఫ్ దాడులు విరమించుకుంది. ఇప్పుడు కూడా హమాస్ ఉగ్రవాదులు ఇదే పని చేస్తున్నారని ఐడీఎఫ్ భావిస్తోంది. నాక్ ఆఫ్ ది రూఫ్ విధానాన్ని అడ్డం పెట్టుకొని.. ప్రజలుంటే ప్రాంతాల్లోనే హమాస్ మూకలు తలదాచుకుంటున్నారని గుర్తించింది. అందుకే.. ఈ విధానానికి స్వస్తి పలకాలని ఇజ్రాయెల్ దళాలు భావిస్తున్నాయి.

ఈ విషయంపై ఐడీఎఫ్‌ ప్రతినిధి రిచర్డ్‌ హెక్ట్‌ మాట్లాడుతూ.. ‘‘తాజాగా చేసిన దాడుల్లో హమాస్ మూకలు ‘నాక్ ఆఫ్ ది రూఫ్’ విధానాన్ని పాటించలేదు. వాళ్లు ఇజ్రాయెల్‌లోకి చొరబడి, మా ఆంబులెన్స్‌పై గ్రనేడ్‌లు విసిరారు. ఎంతోమందిని బందీలుగా తీసుకెళ్లారు. వాళ్లు దాడి చేసే ముందు ముందస్తుగా ఎలాంటి హెచ్చిరకలు జారీ చేయలేదు. ప్రస్తుతం జరుగుతోంది యుద్ధం. కాబట్టి.. దీని ప్రమాణాలు భిన్నంగా ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు. అంటే.. తాము కూడా నాక్ ఆఫ్ ది రూఫ్ అనే విధానాన్ని పాటించమని పరోక్షంగా చెప్పేశారు. దీంతో.. ఈసారి గాజాలో భారీగా రక్తపాతం వెలుగుచూడటం ఖాయమని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-10-11T15:20:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising