ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel-Hamas War: హమాస్‌తో యుద్ధంలో కీలక పరిణామం.. కమాండ్ సెంటర్ ఇజ్రాయెల్ అధీనం

ABN, Publish Date - Dec 21 , 2023 | 03:17 PM

అక్టోబర్ 7వ తేదీన తమపై మెరుపుదాడులు చేసినందుకు ప్రతీకారంగా.. హమాస్‌ని సర్వనాశనం చేయాలని ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది. ఆ లక్ష్యంతోనే.. వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్స్‌తో గాజాపై విరుచుకుపడుతోంది. గాజాలో అమాయక ప్రజలు...

Israel Uncovers Hamas Command Center: అక్టోబర్ 7వ తేదీన తమపై మెరుపుదాడులు చేసినందుకు ప్రతీకారంగా.. హమాస్‌ని సర్వనాశనం చేయాలని ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది. ఆ లక్ష్యంతోనే.. వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్స్‌తో గాజాపై విరుచుకుపడుతోంది. గాజాలో అమాయక ప్రజలు చనిపోతున్న తరుణంలో కాల్పుల విమరణకు పిలుపునివ్వాలని పలు దేశాలు కోరుతున్నా.. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందినా.. ఇజ్రాయెల్ అవేమీ పట్టించుకోకుండా తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఈ యుద్ధంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.

గాజాలో హమాస్ ముఠా నెట్‌వర్క్‌ను పొలాల్లో పురుగుల్ని ఏరినట్టు ఏరుతున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్).. తాజాగా గాజా సిటీలో హమాస్‌కు చెందిన అతిపెద్ద కమాండ్ సెంటర్‌ని అధీనంలోకి తీసుకుంది. ఇక్కడి నుంచే హమాస్ తమ భూగర్భ సొరంగ నెట్‌వర్క్‌ని నిర్వహిస్తున్నట్టు ఐడీఎఫ్ తెలిపింది. ఇప్పుడు దీనిని ఇజ్రాయెల్ తన అధీనంలోకి తీసుకుంది కాబట్టి, హమాస్‌కి గట్టి దెబ్బ తగిలినట్టే. అయితే.. ఈ కమాండ్ సెంటర్ సరిగ్గా ఎక్కడుందన్న విషయాన్ని మాత్రం ఇజ్రాయెల్ దళాలు బయటపెట్టలేదు. మరోవైపు.. ఈ యుద్ధంలో తమకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ హమాస్ వెనకడుగు వేయడం లేదు. చర్యకు ప్రతిచర్య అన్నట్టు భీకర దాడులు చేస్తూనే ఉంది.


ఇదిలా ఉండగా.. బందీల విడుదల కోసం ఇప్పటికే ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అప్పుడు ఏడు రోజుల పాటు ఈ యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. తాజాగా మరోసారి బందీల విడుదలకై ఇజ్రాయెల్ మరో ఒప్పందాన్ని ప్రతిపాదించింది. అయితే.. హమాస్ దీనిని తిరస్కరించిందని సమాచారం. హమాస్‌ చెరలో ఉన్న మరో 40 మంది బందీల విడుదల కోసం 7 రోజుల ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ ప్రతిపాదిస్తే.. ఇజ్రాయెల్‌ తమ దాడులను పూర్తిగా నిలిపివేస్తేనే సంధిపై తాము చర్చిస్తామని మధ్యవర్తిగా ఉన్న ఈజిప్టు ప్రతినిధులకు హమాస్‌ చెప్పినట్లు తెలిసింది. అంతేకాదు.. ఇజ్రాయెల్‌ జైళ్లలోని పాలస్తీనా ఖైదీలను కూడా అప్పగించాలని షరతు పెట్టింది.

మరోవైపు.. గాజాలో సామాన్య పౌరులు మరణిస్తున్న తరుణంలో, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వస్తోంది. ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గాలని డిమాండ్లు వస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు తమని తాము రక్షించుకునే హక్కు ఉందని.. కానీ గాజాను నేలమట్టం చేసేలా, సామాన్యులు విచక్షణారహితంగా చనిపోయేలా దాడులు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. గాజాలో దాడులను వెంటనే ఆపాలని.. మానవతా సహాయం కోసం ఒప్పందం జరగాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - Dec 21 , 2023 | 03:17 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising