ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel-Palestine:ప్రమాదకర కెమికల్స్‌ ఉన్న ఆయుధాలను ప్రయోగించిన ఇజ్రాయెల్!

ABN, First Publish Date - 2023-10-13T10:58:51+05:30

ఇజ్రాయెల్-పాలస్థీనా(Israel- Palestine) మధ్య జరుగుతున్న భీకర పోరులో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హమాస్(Hamas) మిలిటెంట్లకు వ్యతిరేకంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆయుధాల్లో ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు మానవ హక్కుల సంస్థ(Human Rights) ఆరోపించింది.

జెరూసలెం: ఇజ్రాయెల్-పాలస్థీనా(Israel- Palestine) మధ్య జరుగుతున్న భీకర పోరులో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హమాస్(Hamas) మిలిటెంట్లకు వ్యతిరేకంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆయుధాల్లో ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు మానవ హక్కుల సంస్థ(Human Rights) ఆరోపించింది.


వారి వివరాల ప్రకారం.. గాజా, లెబనాన్‌లపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ దళాలు ఆయుధాల్లో ప్రమాదకర తెల్ల భాస్వరం(White Phosphorus) వాడుతున్నట్లు సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ కెమికల్ ఆయుధాలు వాడితే బాధితులు తీవ్ర గాయాలపాలయ్యి, దీర్ఘకాలిక జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ సైన్యం వివరణ కోరగా.. తెల్ల భాస్వరం కలిగిన ఆయుధాలను(Weapons) ఉపయోగించట్లేదని వెల్లడించింది. అయితే ఆ సంస్థ కెమికల్ ఉపయోగించారనడానికి సాక్ష్యాధారాలను చూపుతోంది. వాటి వాడకాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ని కోరుతోంది.

ప్రభావాలివే..

వైట్ ఫాస్ప‌ర‌స్ వ‌ల్ల శ‌రీరం కాలిపోతుంది. జ‌న సాంద్ర‌త ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీనిని ఎక్కువ‌గా వాడుతుంటారు. గాజా, లెబ‌నాన్‌లో ఈ రసాయనానికి సంబంధించిన బాంబులు పేలిన‌ట్లు ఉన్న కొన్ని ఫోటోల‌ను మాన‌వ హ‌క్కుల సంస్థ విడుదల చేసింది. ఆకాశంలో ఏర్ప‌డిన తెల్ల మ‌బ్బుల ఫోటోల ఆధారంగా వైట్ ఫాస్ప‌ర‌స్ ర‌సాయ‌నంతో దాడి జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ రసాయనం ఆక్సిజన్ తో కలిసినప్పుడు మండుతుంది. ఇంటర్నేషనల్ రూల్స్ ప్ర‌కారం దీనిని బ్యాన్ చేయ‌లేదు. కానీ దీనిని వాడటం మనిషి ప్రాణాలకు సైతం ముప్పు తెచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-10-13T11:59:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising