ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel-Hamas War: ఇజ్రాయెల్ మరో హెచ్చరిక.. భయాందోళనలో గాజా ప్రజలు.. తట్టాబుట్టా సర్దుకొని..

ABN, First Publish Date - 2023-11-18T16:34:30+05:30

Israel-Hamas: హమాస్‌ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ గాజాలో ఉంటున్న ప్రజలను వెంటనే ఆ ప్రాంతం ఖాళీ చేయమని ఆదేశించింది. అక్కడి నుంచి పశ్చిమ గాజాకు వీలైనంత త్వరగా తరలివెళ్లాలని సూచించింది.

హమాస్‌ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ గాజాలో ఉంటున్న ప్రజలను వెంటనే ఆ ప్రాంతం ఖాళీ చేయమని ఆదేశించింది. అక్కడి నుంచి పశ్చిమ గాజాకు వీలైనంత త్వరగా తరలివెళ్లాలని సూచించింది. దీంతో.. దక్షిణ గాజాలో ఉన్న పాలస్తీనియన్లు ప్రాణభయంతో అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోయతున్నారు. ఈలోపే దాడులు జరుగుతాయేమోనన్న భయంతో వాళ్లు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాణాల్ని అరచేతిలో పట్టుకొని వలస బాట పట్టారు.


తొలుత ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాలో భీకర దాడులు జరిపింది. ఈ దాడులు జరిపినప్పుడు ఉత్తర గాజాలో ఉన్న ప్రజలందరూ దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఆదేశాలు రావడంతో.. ప్రజలందరూ అక్కడికి తరలివెళ్లారు. ఇప్పుడు దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ దృష్టి పెట్టడంతో.. అక్కడున్న ప్రజల్ని పశ్చిమ గాజాకి వెళ్లాల్సిందిగా హెచ్చరించింది. ‘‘ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని మేము సూచించాం. ఇది అంత సులభం కాదు కానీ.. ఈ ఎదురుకాల్పుల్లో సామాన్య పౌరులు చిక్కుకోకూడదని మేము భావిస్తున్నాం. అందుకే, వెళ్లిపోవాలని హెచ్చరించాం’’ అని ఒక ఇజ్రాయెల్ అధికారి తెలిపారు. పశ్చిమ గాజాలో మానవతా సహాయం పొందేందుకు సులువుగా ఉంటుందని కూడా ఇజ్రాయెల్ పేర్కొంది. దీంతో మరో దారి లేక ప్రజలందరూ పశ్చిమ ప్రాంతానికి తరలిపోతున్నారు.

ఇదిలావుండగా.. అక్టోబర్ 7వ తేదీన మొదలైన ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలుత హమాస్ మెరుపుదాడులు చేయగా.. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో విరుచుకుపడుతోంది. వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్స్‌తో.. హమాస్‌ని తుడిచిపెట్టేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉత్తర గాజాలో తనఖీలు చేస్తున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్).. స్కూల్స్, ఆసుపత్రుల్లో హమాస్ దాచి ఉంచిన మారణాయుధాల్ని బట్టబయలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోల్ని సైతం విడుదల చేసింది. మరోవైపు.. సామాన్య పౌరులు మరణిస్తున్న తరుణంలో ‘సీజ్‌ఫైర్’కి ప్రపంచదేశాలు అభ్యర్థిస్తుంటే.. ఇజ్రాయెల్ మాత్రం తగ్గేదే లేదంటూ దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది.

Updated Date - 2023-11-18T16:34:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising