ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rona-Lee Shimon: ఇజ్రాయిలీ నటి సంచలన నిర్ణయం.. దేశం కోసం అందుకు సిద్ధం.. ఏంటో తెలుసా?

ABN, First Publish Date - 2023-10-16T16:24:28+05:30

సాధారణంగా నటీనటులు తమ ప్రాజెక్టులు, వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువగా పట్టించుకుంటారు. ఇతర విషయాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోరు. ముఖ్యంగా.. తమకు పెద్దగా అనుభవం లేని విషయాల జోలికి...

సాధారణంగా నటీనటులు తమ ప్రాజెక్టులు, వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువగా పట్టించుకుంటారు. ఇతర విషయాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోరు. ముఖ్యంగా.. తమకు పెద్దగా అనుభవం లేని విషయాల జోలికి అస్సలు వెళ్లరు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. దేశం కోసం తమవంతు మద్దతు తెలుపుతారే తప్ప, నేరుగా రంగంలోకి దిగరు. కానీ.. ఇజ్రాయిలీ నటి రోనా-లీ షిమోన్ మాత్రం హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు గాను ఇజ్రాయెల్ సైన్యంలో చేరేందుకు సిద్ధంగా ఉంది. తన దేశం కోసం ఏం చేయడానికైనా రెడీ అని ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఈ నటి ప్రముఖ వెబ్ సిరీస్ ఫౌడాలో ఒక కీలక పాత్రలో నటించారు.

ఓ ఇంటర్వ్యూలో షిమోన్ మాట్లాడుతూ.. తమ దేశంపై దాడులు చేసిన హమాస్‌ను వ్యతిరేకిస్తానని పేర్కొన్నారు. హమాస్ దాడుల్లో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర మనోవేదనకు గురయ్యానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇజ్రాయెల్‌ను గెలిపించడానికి తన శక్తి మేర ప్రతీదీ చేస్తానన్నారు. అలాగే.. హమాస్ దాడుల్ని ఖండిస్తూ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన భారత్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్ వంటి అందమైన మిత్రదేశం కలిగి ఉన్నందుకు తాను కృతజ్ఞతగా భావిస్తున్నానని, ఈ భూమిపై ఉన్న ఇష్టమైన దేశాల్లో భారతదేశం ఒకటని, అక్కడి ప్రజల్ని తాను ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పారు. హమాస్ దాడుల్ని ఖండించి, ఇజ్రాయెల్ పక్షాన భారత్ నిలబడటమే.. మాకు చేయగలిగిన గొప్ప పని ఆమె అని చెప్పుకొచ్చారు.


ప్రస్తుతం తాము యుద్ధంలో ఉన్నామని, ఈ యుద్ధంలో తామే గెలిచి తీరుతామని షిమోన్ ధీమా వ్యక్తం చేశారు. బందీలను క్షేమంగా ఇంటికి తీసుకురావడమే తమ మొదటి ప్రాధాన్యత అని, ఇందుకు తమ దేశం ప్రతీదీ చేస్తోందని అన్నారు. హమాస్ చేసిన దాడి ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత భయంకరమైనదని ఆమె అభివర్ణించారు. తాము సైన్యానికి మద్దతు ఇస్తున్నామన్న ఆ నటి.. ఈ యుద్ధం మరింత దారుణంగా మారే అవకాశం ఉందని, అయితే అలా జరగకుండా ఉండేలా తమ దేశం చర్యలు తీసుకుంటోందన్నారు. బందీలలో ఒక్క ఇజ్రాయెల్ పౌరులే లేరని, 36 దేశాల పౌరులు ఉన్నారని, ఈ బందీలను తిరిగి ఇంటికి తీసుకురావడం కోసం ప్రపంచ సమాజం ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచ నాయకులు ముందుకొచ్చి సహాయం చేయానలి కోరారు.

మతపరమైన తీవ్రవాదం గురించి అడిగినప్పుడు.. మతం అనేది ఎంతో అందమైనదని, దానిని ఎలా వాడాలన్నది మనుషుల ఎంపిక అని షిమోన్ చెప్పారు. తమలో స్పార్క్‌ను కోల్పోయిన వాళ్లు మాత్రమే మతాన్ని చెడుగా వినియోగిస్తారని వివరించారు. హమాస్‌ని ఐసిస్ ఉగ్రవాదులతో పోల్చిన ఆ నటి.. వాళ్లు ఇప్పుడు ఆగరని హెచ్చరించారు. వాళ్లను ఆపేందుకు తమ ఇజ్రాయెల్ సైన్యం సాయశక్తులా ప్రయత్నిస్తోందని, ఇందులో పాలుపంచుకోవడానికి తానూ సిద్ధంగా ఉన్నానని అన్నారు.

Updated Date - 2023-10-16T16:24:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising