ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel-Hamas War: హమాస్‌పై పరమాణు బాంబు.. ఇది ‘డూమ్స్‌డే’ని ముద్దాడే సమయం

ABN, First Publish Date - 2023-10-11T20:34:49+05:30

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ) చేసిన మెరుపుదాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటోంది. కేవలం హమాస్ రహస్య స్థావరాల్ని మట్టుబెట్టడమే కాదు.. ఓవరాల్‌గా ఆ సంస్థనే బూడిదపాలు చేయాలన్న లక్ష్యంతో...

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ) చేసిన మెరుపుదాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటోంది. కేవలం హమాస్ రహస్య స్థావరాల్ని మట్టుబెట్టడమే కాదు.. ఓవరాల్‌గా ఆ సంస్థనే బూడిదపాలు చేయాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ దూసుకుపోతోంది. గాజాని స్వాధీనం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం ఇప్పటికే భారీ సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇంధన, విద్యుత్, ఆహార సరఫరాలపై నిషేదం విధించి.. గాజాని దిగ్బంధించింది. ‘నాక్ ఆన్ ది రూఫ్’ విధానానికి కూడా మంగళం పాడాలని (ఇదే జరిగితే గాజా రక్తపాతంతో నిండిపోతుంది. అంటే, గాజావాసుల్ని కూడా లెక్కచేయకుండా దాడి చేస్తారు) చూస్తోంది.

ఇలాంటి తరుణంలో హమాస్‌ను అంతం చేసేందుకు దాని అధీనంలో ఉన్న గాజాపై అణ్వాయుధాలు ప్రయోగించాలని.. ఇజ్రాయెల్‌లోని అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ సూచించారు. ఆమె పేరు తాలీ గాట్లీట్. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ శాసనసభ్యురాలు అయిన ఆమె.. తన అధికారిక ట్విటర్ (X ప్లాట్‌ఫార్మ్) ఖాతాలో పరమాణు బాంబు ప్రస్తావన తీసుకొచ్చారు. ‘‘జెరిఖో క్షిపణి! జెరిఖో క్షిపణి! బలగాలను మోహరించే ముందు ఇది వ్యూహాత్మక హెచ్చరిక. ప్రళయాన్ని సృష్టించే ఈ ఆయుధాన్ని వినియోగించాలని నా అభిప్రాయం. దేవుడు మన శక్తినంతటిని కాపాడు గాక’’ అంటూ ట్వీట్ చేశారు. అంతటితో ఆగలేదు.. మరో ట్వీట్‌లోనూ ఇప్పుడు డూమ్స్ డే (ప్రళయం)ని ముద్దాడే సమయమని పేర్కొన్నారు.


‘‘మిడిల్ ఈస్ట్‌ మొత్తం దద్దరిల్లిపోయేలా చేసే ఈ అణ్వాయుధమే ఇజ్రాయెల్ దేశపు గౌరవాన్ని, బలాన్ని, భద్రతను పునరుద్ధరిస్తుంది. ఇది డూమ్స్‌డేని ముద్దాడే సమయం. ఎటువంటి పరిమితులు లేకుండా శక్తివంతమైన క్షిపణులను కాల్చే సమయం ఇది. పొరుగు ప్రాంతమైన గాజాను చూర్ణం చేసి చదును చేయాలి. కనికరం లేకుండా చొచ్చుకుపోవాలి’’ అంటూ తన పోస్టులో తాలీ రాసుకొచ్చింది. అయితే.. ఇది హింసను ప్రేరేపించేలా ఉండటంతో, ఈ ట్వీట్ పరిమిత యూజర్లకు మాత్రమే కనిపించేలా ట్విటర్ నియమాలు తీసుకుంది. తాలీ ఇలాంటి సంచలన ట్వీట్లు చేయడం ఇదే తొలిసారి కాదు. సెప్టెంబరులో పాలస్తీనా వాహనదారుడిని కాల్చి చంపిన ఇజ్రాయెల్ మిలటరీ కమాండర్‌ను ఆమె హీరోగా అభివర్ణించింది.

కాగా.. జెరిఖో అనేది ఇజ్రాయెలీ బాలిస్టిక్ క్షిపణి. దీనిని 1960లలో ఇజ్రాయెల్ తొలిసారిగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దాని మూడు వేరియంట్‌లైన జెరిఖో-1, జెరిఖో-2, జెరిఖో-3 సేవలో ఉన్నాయి. దీనికి బైబిల్ నగరం జెరిఖో పేరు పెట్టారు. ఇతర ఆయుధాల మాదిరిగానే.. ఇజ్రాయెల్ ఈ క్షిపణిని రహస్యంగా దాచిపెట్టింది. అందుకే.. ఈ క్షిపణి గురించి ఎక్కువ సమాచారం పబ్లిక్‌గా రాలేదు. జెరిఖో 1 క్షిపణి 400 కిలోల పేలుడు పదార్థాలతో 500 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించగలదని నమ్ముతారు. ఇక జెరిఖో 2 క్షిపణి 1770 కిలోమీటర్ల దూరంలో అణు దాడుల్ని నిర్వహించగలదు.

Updated Date - 2023-10-11T20:35:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising