Israeil - Hamas: గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్.. వారి మృతదేహాల్ని సంచుల్లో పంపుతామని హెచ్చరించిన హమాస్
ABN, First Publish Date - 2023-11-03T07:55:20+05:30
ఇజ్రాయెల్ - గాజాల(Israeil - Gaza) మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. తాజాగా గాజాను చుట్టు ముట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించడం ఆందోళనలు కలిగిస్తోంది. దీనికి ప్రతిగా హమాస్(Hamas) టెర్రరిస్టులు ఇజ్రాయెల్ సైన్యం మృతదేహాల్ని సంచుల్లో పెట్టి జెరూసలెంకి పంపుతామని హెచ్చరించడం యుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది. పరస్పర హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గాజా: ఇజ్రాయెల్ - గాజాల(Israeil - Gaza) మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. తాజాగా గాజాను చుట్టు ముట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించడం ఆందోళనలు కలిగిస్తోంది. దీనికి ప్రతిగా హమాస్(Hamas) టెర్రరిస్టులు ఇజ్రాయెల్ సైన్యం మృతదేహాల్ని సంచుల్లో పెట్టి జెరూసలెంకి పంపుతామని హెచ్చరించడం యుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది. పరస్పర హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శాంతి చర్చలు చేపట్టాలని ఇరుప్రాంతాలకు విన్నవిస్తున్నాయి. హమాస్ నియత్రణలో ఉన్న గాజా నగరాన్ని తమ భూ బలగాలు పూర్తిగా చుట్టుముట్టాయని, టెర్రరిస్టులపై తమ సైన్యం మరింత నిఘా పెంచిందని ఇజ్రాయెల్ పేర్కొంది.అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్ - హమాస్ దాడుల్లో ఇప్పటివరకు 3,648 మంది పిల్లలతో సహా 8,796 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
యుద్ధంలో తాజా పరిణామాలు..
హమాస్ ఉగ్రవాద సంస్థ కేంద్రంగా ఉన్న గాజా నగరాన్ని చుట్టుముట్టడాన్ని ఇజ్రాయెల్ సైనికులు పూర్తి చేశారని ఆ దేశ మిలటరీ అధికార ప్రతినిధి డేనియల్ హగారి తెలిపారు. యుద్ధ విరమణ అంశం ప్రస్తుతం తమ పరిధిలో లేదన్నారు.
US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ రెండోసారి ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్నారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా ఇజ్రాయెల్ అధికారులను కలవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హమాస్ చేతిలో ఉన్న బందీలందరినీ విడుదల చేయడంపై ఈజిప్ట్, ఖతార్ నేతృత్వంలో చర్చలు జరుపుతామని మిల్లర్ చెప్పారు.
రఫా క్రాసింగ్(Rafa Crossing) ద్వారా వందల సంఖ్యలో విదేశీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈజిప్టుకి వెళ్తున్నారు. నిన్న ఒక్కరోజే 344 మంది విదేశీయులు సరిహద్దు దాటినట్లు ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు హమాస్ కమాండర్‌లు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
అక్టోబరు 7 దాడుల సమయంలో హమాస్ బంధించిన 240 మంది బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ సైన్యం ప్రయత్నిస్తోంది. బందీలుగా ఉన్నవారిని కనుగొనే ప్రయత్నంలో అమెరికా గాజాపై డ్రోన్‌లను ఎగురవేస్తోంది.
లెబనాన్ - ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా గ్రూప్ గురువారం దాని నాయకుడు హసన్ నస్రల్లా ప్రసంగానికి ముందు సరిహద్దు వెంబడి 19 ఇజ్రాయెల్ స్థావరాలపై దాడి చేసినట్లు పేర్కొంది.
ఘోరమైన దాడులు "యుద్ధ నేరాలకు సమానం" అని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించింది. వీటిపై ఆందోళన చెందుతున్నామని యూఎన్ మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది.
Updated Date - 2023-11-03T07:55:24+05:30 IST