Italy : ఇటాలియన్ నగరం మిలన్‌లో భారీ పేలుడు.. నలుగురి మృతి, పలు వాహనాలు ఆహుతి..
ABN, First Publish Date - 2023-05-11T17:29:09+05:30
ఉత్తర ఇటలీలోని మిలన్ నగరంలో ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో భారీ విధ్వంసం జరిగింది. ఈ మంటల్లో అనేక వాహనాలు ఆహుతి అయ్యాయి.
మిలన్ (ఇటలీ) : ఉత్తర ఇటలీలోని మిలన్ నగరంలో ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో భారీ విధ్వంసం జరిగింది. ఈ మంటల్లో అనేక వాహనాలు ఆహుతి అయ్యాయి. ఈ సిలిండర్లను తీసుకెళ్తున్న వ్యాన్‌కు మొదట నిప్పు అంటుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. వ్యాన్‌లో ఉన్న సిలిండర్లు పేలి, అత్యంత వేగంగా మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించినట్లు తెలిపింది.
ఈ ప్రమాదంలో దాదాపు ఐదు కార్లు, నాలుగు మోపెడ్లు, అగ్నికి ఆహుతి అయినట్లు, నలుగురు మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనను కొన్ని గజాల దూరం నుంచి కొందరు వీడియో తీశారు. ఈ వీడియోలు అత్యంత భయానకంగా ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షులు అవాక్కయి చూస్తుండటం కనిపించింది. నల్లని పొగ దట్టంగా ఆకాశంలోకి వేగంగా వెళ్తుండటం కనిపించింది. అగ్నిమాపక శకటాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది చురుగ్గా సహాయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఇటాలియన్ పోలీసులు ఈ ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న భవనాల నుంచి కూడా పొగ వస్తుండటంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. సమీపంలోని ఓ పాఠశాల, నర్సింగ్ హోంలను ఖాళీ చేయించారు.
ఇవి కూడా చదవండి :
Uddhav Thackeray: సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట
Delhi : సుప్రీంకోర్టు తీర్పుపై కేజ్రీవాల్ హర్షం.. అధికారులకు హెచ్చరిక..
Updated Date - 2023-05-11T17:29:09+05:30 IST