ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Man Turns Into Wolf: 20 లక్షలు ఖర్చు పెట్టి తోడేలుగా మారిన ఇంజినీర్.. ఆ సమస్యకి ఇదే విరుగుడు!

ABN, First Publish Date - 2023-08-01T20:59:51+05:30

ప్రతి ఒక్కరికీ తమకంటూ ఒక ప్రత్యేకమైన డ్రీమ్ ఉంటుంది. చిన్నప్పుడే ఒక లక్ష్యం పెట్టుకొని, దాన్ని సాధించేందుకు కసరత్తులు చేస్తుంటారు. తమ లక్ష్యసాధన ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే.. పట్టు వదలరు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సాధించే తీరుతారు.

ప్రతి ఒక్కరికీ తమకంటూ ఒక ప్రత్యేకమైన డ్రీమ్ ఉంటుంది. చిన్నప్పుడే ఒక లక్ష్యం పెట్టుకొని, దాన్ని సాధించేందుకు కసరత్తులు చేస్తుంటారు. తమ లక్ష్యసాధన ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే.. పట్టు వదలరు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సాధించే తీరుతారు. ఇప్పుడు ఓ ఇంజనీర్ కూడా తన చిన్ననాటి కలని నెరవేర్చుకున్నాడు. చిన్నప్పుడు తోడేలు పట్ల ఆకర్షితుడైన ఇతగాడు.. పెద్దయ్యాక ఇంజనీర్‌గా మారి, నాలుగు రాళ్లు వెనక్కు వేసుకొని, ఫైనల్‌గా తోడేలుగా మారాడు.

ఆ ఇంజినీర్ పేరు టోరు యూడా. వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన ఇతనికి 32 సంవత్సరాలు. చిన్నప్పుడు తోడేలు పట్ల ఆకర్షితుడు అయిన అతడు.. తాను కూడా ఆ అవతారం ఎత్తాలని అనుకున్నాడు. కానీ.. అది అంత ఈజీ కాదని అతనికి తెలిసింది. చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలుసుకున్నాక.. కెరీర్‌పై బాగా ఫోకస్ పెట్టాడు. తనకు నచ్చిన ఇంజినీర్ కోర్సు పూర్తి చేసి.. చివరికి ఇంజినీర్ అయ్యాడు. తన వృత్తిలో కష్టపడి, బాగా డబ్బులు సంపాదించిన తర్వాత.. ఇక తన ‘తోడేలు అవతారం’ డ్రీమ్‌ని నెరవేర్చుకునే పనిలో నిమగ్నమైపోయాడు.


అప్పుడే టోరుకి జెపెట్ అనే వర్క్‌షాప్ గురించి తెలిసింది. ఇది.. సినిమా, టీవీ పరిశ్రమలకు కాస్ట్యూమ్స్ అందించే మోడలింగ్ కంపెనీ. ఈ వర్క్‌షాప్ వాళ్లు జంతువుల వస్తువుల్ని సహజత్వానికి దగ్గరగా ఉండేలా తయారు చేస్తారని తెలుసుకొని.. టోరు వాళ్లని సంప్రదించాడు. తన సైజుకి సరిపోయే తోడేలు కాస్ట్యూమ్ తయారు చేయాలని, అది వాస్తవికతకు దగ్గరగా ఉండాలని సూచించాడు. అలాగే.. ఆ దుస్తులు ధరించిన తర్వాత తనకు ఇబ్బంది కలగకుండా, సాధారణంగా నడిచేలా ఉండాలని చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే జెపెట్ సంస్థ తోడేలు దుస్తులు సిద్ధం చేసింది.

తనకు ఈ సూట్ అందిన తర్వాత టోరు దాన్ని ధరించి, ఫోటోషూట్ చేసి, సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేశాడు. ఈ సూట్ తనకెంతో సౌకర్యవంతంగా ఉందని, ఇది వేసుకున్నప్పుడు తాను చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతానని చెప్పాడు. ఈ కాస్ట్యూమ్ వేసుకున్నాక తాను మనిషిని కాదన్న భావన కలుగుతుందన్నాడు. మానవ సంబంధాలు, కష్టాలు, పని ఒత్తిడి వంటి మర్చిపోయే.. స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతానన్నాడు. ఈ కాస్ట్యూమ్‌తో బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంటుందని.. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం దీన్ని తరచుగా ధరిస్తానని టోరు చెప్పుకొచ్చాడు. ఇది తన సమస్యలకు చెక్ పెట్టే విరుగుడిలా పని చేస్తోందని తెలిపాడు.

Updated Date - 2023-08-01T20:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising