ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hamas On Kim Jong Un: అమెరికాను కొట్టే ధైర్యం అతనికి మాత్రమే ఉంది.. కిమ్ జోంగ్ ఉన్‌పై హమాస్ అధికారి ప్రశంసలు

ABN, First Publish Date - 2023-11-04T19:23:38+05:30

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. హమాస్ సీనియర్ అధికారి అలీ బరాకా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికాను కొట్టే ధైర్యం ఒక్క నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కి మాత్రమే...

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. హమాస్ సీనియర్ అధికారి అలీ బరాకా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికాను కొట్టే ధైర్యం ఒక్క నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కి మాత్రమే ఉందని కుండబద్దలు కొట్టాడు. అమెరికా, బ్రిటన్‌లు కూడా సోవియట్ యూనియన్‌ (యూఎస్ఎస్ఆర్ - యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్) తరహాలో కుప్పకూలిపోతాయని పేర్కొన్నాడు. అమెరికాది అంతా గతమని, అది శక్తివంతంగా ఉండదని బాంబ్ పేల్చాడు.

గురువారం ఓ లెబనీస్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ బరాకా మాట్లాడుతూ.. ‘‘అమెరికా అనేది ఒక గతం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అగ్రరాజ్యాన్ని కొట్టే సామర్థ్యం ఎవరికైనా ఉందంటే, అది కేవలం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ మాత్రమే. అతనొక్కడే అమెరికాపై దాడి చేయగలడు’’ అని చెప్పాడు. పాలస్తీనియన్లు, హమాస్‌కు మద్దతు కోసం కిమ్ జోంగ్ ఉన్ చేసిన విజ్ఞప్తిపై తన అభిప్రాయం ఏంటని ప్రశ్న అడగ్గా.. అతడు ఆ విధంగా స్పందించాడు. అంతేకాదు.. ‘‘బ్రిటన్, గ్లోబల్ ఫ్రీమాసోన్రీ ద్వారా అమెరికా స్థాపించబడింది. ఏ విధంగా అయితే సోవియట్ యూనియన్ కూలిపోయిందో, అలాగే అది కూడా కుప్పకూలుతుంది. అమెరికా ఇంకెప్పటికీ శక్తివంతమైన దేశంగా ఉండదు’’ అని చెప్పుకొచ్చాడు.


ఇదే సమయంలో ఇరాన్ గురించి బరాకా మాట్లాడుతూ.. అమెరికాని కొట్టే సామర్థ్యం ఆ దేశానికి లేదని తేల్చి చెప్పాడు. ఒకవేళ హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ జోక్యం చేసుకుంటే.. అది జియోనిస్టుల ప్రాపర్టీ, అమెరికా స్థావరాలపై దాడి చేయగలదని అన్నాడు. ఇరాన్ వద్ద అమెరికాపై దాడి చేసేంత ఆయుధాలు లేవన్నాడు. ఒకవేళ ఈ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే మాత్రం.. అప్పుడు ఇజ్రాయెల్‌లోని అమెరికా స్థావరాలు, నౌకలపై ఇరాన్ తప్పకుడా దాడులు చేస్తుందని వివరించాడు. అయితే.. ఉత్తర కొరియాకు మాత్రం అమెరికాపై దాడి చేసే సత్తా ఉందన్నాడు. ఆ సమయం తప్పకుండా వస్తుందని.. ఎందుకంటే ఉత్తర కొరియా తమ కూటమిలోని ఒక భాగమని వెల్లడించాడు.

ఇజ్రాయెల్ ప్రాంతంలోని అమెరికా శత్రువులు ఒకరికొకరు సంప్రదింపులు జరుపుకుంటూ దగ్గరవుతున్నారని.. కచ్ఛితంగా ఆ దేశం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పాల్గొనే రోజు రావొచ్చని అలీ బకారా అభిప్రాయపడ్డారు. అదే జరిగితే మాత్రం.. అమెరికాకు భవిష్యత్తు అనేదే లేకుండా చేస్తామని, ఒక గతంలా మిగిలిపోయే దాన్ని మార్చేస్తామని హెచ్చరికలు జారీ చేశాడు. అంటే.. ఇప్పుడు సాగుతున్న యుద్ధంలో ఏమాత్రం జోక్యం చేసుకోవద్దని ఆ హమాస్ అధికారి పరోక్షంగా అమెరికాకు సంకేతాలు పంపుతున్నాడు.

Updated Date - 2023-11-04T19:23:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising