ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Libya Floods: శవాల దిబ్బగా మారిన డెన్నా నగరం.. 11 వేలకు పైగా చేరిన మృతుల సంఖ్య.. ఇంకా 10 వేల మంది మిస్సింగ్

ABN, First Publish Date - 2023-09-17T18:37:12+05:30

నిన్నటివరకు ఎత్తైన భవంతులు, వేలాదిమంది జనాలతో కిటకిటలాడే అందమైన డెన్నా నగరం.. ఇప్పుడు శవాల దిబ్బగా మారింది. డేనియల్ తుఫాన్ సృష్టించిన జలప్రయళం కారణంగా..

నిన్నటివరకు ఎత్తైన భవంతులు, వేలాదిమంది జనాలతో కిటకిటలాడే అందమైన డెన్నా నగరం.. ఇప్పుడు శవాల దిబ్బగా మారింది. డేనియల్ తుఫాన్ సృష్టించిన జలప్రయళం కారణంగా.. ఆ నగరమంతా స్మశాన వాటికలా తయారైంది. ఆ తుఫాన్ దెబ్బకు భారీ వర్షాలు కురవడంతో.. నగరానికి సమీపంలో ఉండే రెండు పెద్ద డ్యామ్‌లు బద్దలైపోయాయి. దాంతో.. డెన్నా నగరమంతా వరదల్లో కొట్టుకుపోయింది. భవనాలన్నీ ధ్వంసం అవ్వగా.. వేలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అకస్మాత్తుగా సంభవించిన విపత్తు కారణంగా.. పాపం ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. అటు.. అధికారులు సైతం ఈ విపత్తుని అంచనా వేయలేకపోయారు. బురదలో మృతదేహాలు చిక్కుకుపోవడంతో.. ఆ ప్రాంతమంతా స్మశానాన్ని తలపిస్తోంది.


ఈ విపత్తు కారణంగా 10 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఇంతకుముందు ఒక రిపోర్ట్ రాగా.. ఇప్పుడు మరణాల సంఖ్య 11 వేలకు పైగా చేరింది. ఈ వరదల వల్ల 11,300 మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి (యూఎన్) ఒక రిపోర్ట్‌ని విడుదల చేసింది. ఈ సంఖ్య మరింత పెరిగినా పెరగొచ్చని సూచించింది. అంతేకాదు.. 10,100 మంది ఆచూకీ కూడా కనిపించడం లేదని యూఎన్‌కి చెందిన మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం రెడ్ క్రెసెంట్ తెలిపింది. సెర్చ్, సహాయక బృందాలు అవిశ్రాంతిగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయని యూఎన్ పేర్కొంది. డేనియల్ తుఫాను ఈశాన్య లిబియాను తాకిన దాదాపు ఒక వారం తర్వాత.. డెర్నాలో మానవతావాద పరిస్థితి భయంకరంగా ఉందని వెల్లడించింది. నగరంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఏర్పడిందని.. కలుషిత నీటిని తాగడం వల్ల కనీసం 55 మంది చిన్నారులు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని యూఎన్ చెప్పింది. కాగా.. గత కొన్నేళ్లుగా ఎన్నో సంక్షోభాల్సి ఎదుర్కొని ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న లిబియాను ఈ విపత్తు చిన్నాభిన్నం చేసింది.

మరోవైపు.. ఈ జలప్రళయం ధాటికి అతలాకుతలమైన లిబియాను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఇప్పటికే కొన్ని దేశాలు సహాయక బృందాలతో పాటు క్షతగాత్రుల కోసం సరుకులు రవాణా చేశాయి. రెండు హెలికాప్టర్లు, బుల్‌డోజర్‌లు, టెంట్లు, దుప్పట్లు, పంపులతో కూడాన ఓడ డెర్నాకు చేరుకుందని ఇటాలియన్ రాయబార కార్యాలయం తెలిపింది. ఫ్రాన్స్ నుండి ఫీల్డ్ హాస్పిటల్‌తో పాటు సౌదీ అరేబియా, కువైట్ నుండి టన్నుల కొద్దీ సహాయం కూడా అక్కడకు చేరుకుంది. డెర్నాకు పశ్చిమాన 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్-బైడాలో ప్రజలు రోడ్లు, ఇళ్లలో మట్టి దిబ్బలను తొలగించడానికి తమవంతు సహకారం అందించారు.

Updated Date - 2023-09-17T18:37:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising