ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India-Maldives: ముగిసిన హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం.. అక్కడ భారత్ భద్రతపై దీని ప్రభావం ఏంటి?

ABN, Publish Date - Dec 17 , 2023 | 03:59 PM

మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఆ దేశం భారత్‌కి ఒకదాని తర్వాత మరొక షాక్‌లు ఇస్తోంది. కొద్ది రోజుల క్రితమే.. భారత దళాల్ని ఉపసంహరించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌ని...

Hydrographic Survey: మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఆ దేశం భారత్‌కి ఒకదాని తర్వాత మరొక షాక్‌లు ఇస్తోంది. కొద్ది రోజుల క్రితమే.. భారత దళాల్ని ఉపసంహరించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌ని భారత్ అంగీకరించినట్టు కూడా తెలిపింది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఆ దేశం మరో బాంబ్ పేల్చింది. 2019లో భారత్, మాల్దీవుల మధ్య జరిగిన నీటి ఒప్పందాన్ని (హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం) ముగించింది. నిజానికి.. ఈ ఒప్పందాన్ని వచ్చే ఏడాది జూన్ 7వ తేదీన పునరుద్ధరించాల్సి ఉంది. కానీ మాల్దీవులు దీనిని మరింత పొడిగించకూడదని నిర్ణయించుకుంది. రిపోర్ట్స్ ప్రకారం.. మాల్దీవుల ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గురించి భారత హైకమిషన్‌కు కూడా సమాచారం అందింది.


అసలు హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం అంటే ఏమిటి?

2019 జూన్ 8వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటన సందర్భంగా.. అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్‌తో ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. మాల్దీవుల ప్రాదేశిక జలాల హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్వహించడానికి, ఈ ప్రాంతాల్లోని రీఫ్‌లు, మడుగులు, బీచ్‌లు, సముద్ర ప్రవాహాలు, ఆటుపోట్ల స్థాయిలను అధ్యయనంతో పాటు చార్ట్ చేయడానికి భారత్‌కి అనుమతి ఉంది. మొదటి సర్వే 2021 మార్చిలో, రెండో సర్వే 2022 మేలో, మూడో సర్వే 2023 ఫిబ్రవరిలో జరిగింది. ఈ సర్వేలను భారత నౌకాదళం, మాల్దీవుల జాతీయ రక్షణ దళం సంయుక్తంగా నిర్వహించాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేలా అప్పట్లో మాట్లాడుకున్నారు.

ఒకవేళ రెండు దేశాల్లో ఎవరైనా ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని అనుకుంటే.. అప్పుడు ఆ దేశం ఆరు నెలల ముందే తన నిర్ణయాన్ని ఇతర దేశానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మాల్దీవుల ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో.. ఆరు నెలల ముందుగానే తన నిర్ణయాన్ని భారత హైకమిషన్‌కు తెలిపింది. కాబట్టి.. ఈ ఒప్పందం అనేది 2024 జూన్ 7వ తేదీన ముగియనుంది. మాల్దీవుల ప్రభుత్వం ప్రకారం.. ఈ నీటి సర్వే అనేది సున్నితమైన సమాచారాన్ని బయటపెడుతుంది. ఇది మాల్దీవులు మాత్రమే తెలుసుకోవాలి. కాబట్టి.. మరే ఇతర దేశం ఇలాంటి సర్వేలో పాల్గొనడం సరికాదు. అందుకే.. మాల్దీవుల ప్రభుత్వం భారత్‌తో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది.


ఈ నిర్ణయం హిందూ మహాసముద్రంలో భారత్ భద్రతా వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

న్యూఢిల్లీలోని JNU యూనివర్సిటీలో సెంటర్ ఫర్ చైనీస్ స్టడీస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ అరవింద్ యెలేరి మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ రాజకీయాలు 1996-1997 నుండి బ్లూ ఎకానమీ (ఓషన్ ఎకానమీ)పై ఎక్కువగా దృష్టి సారించాయి. అయితే.. హిందూ, పసిఫిక్ మహాసముద్రాలకు భారత్ దగ్గరగా ఉంది. అందుకే సముద్ర సంబంధిత వ్యూహాత్మక విషయాల్లో భారత్ పాత్ర పెరిగింది’’ అని అన్నారు. బ్లూ ఎకానమీ రాజకీయాల నుండి భారత్.. దక్షిణ చైనా, అరేబియా, హిందూ మహాసముద్రాల్లో తన వ్యూహాత్మక ప్రయోజనాలపై దృష్టి పెట్టడం ప్రారంభించిందన్నారు. ఈ సమయంలోనే మారిషన్, మాల్దీవులు, సీషెల్స్ వంటి దేశాలతో భారత్ సంబంధాలు పెరిగాయన్నారు. నిఘా, ఇంధన సరఫరా, అనేక ఇతర విషయాలకు సంబంధించి ఈ దేశాల్లో భారత్‌కి ఆసక్తులున్నాయన్నారు.

అయితే.. గత కొన్నేళ్లుగా చైనా కూడా హిందూ మహాసముద్రంలో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని అరవింద్ యెలేరి పేర్కొన్నారు. ఈ దేశం దక్షిణ చైనా సముద్రం నుండి బయటికొచ్చి, హిందూ మహాసముద్రంలో తన కార్యకలాపాలను పెంచుకోవడానికి కారణం ఇదేనన్నారు. ఇప్పుడు మాల్దీవుల్లో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం చైనాకు చాలా సానుకూల అవకాశాలను తెచ్చిపెట్టిందన్నారు. అయితే.. దీని ప్రభావం భారత్‌పై అంతగా ఉండదన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం భారత్, చైనాలతో సంబంధాలు ఎలా సాగించాలోంటోందనే విషయం రాబోయే నాలుగు-ఐదేళ్లలో తేలిపోతుందన్నారు. కాకపోతే.. మాల్దీవుల నుంచి భారత సైనికుల్ని ఉపసంహరించుకోవడం అనేది కాస్త ఆందోళన కలిగించే విషయమని చెప్పుకొచ్చారు.

Updated Date - Dec 17 , 2023 | 03:59 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising