ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

USA: అమెరికా చట్టసభ సభ్యురాలిపై యువకుడి దాడి.. ఆమె తన చేతిలోని వేడి వేడి కాఫీని..

ABN, First Publish Date - 2023-02-10T16:29:37+05:30

అమెరికా చట్టసభ సభ్యురాలు యాంజీ క్రెయిగ్‌పై గురువారం జరిగిన దాడి కేసులో నిందితుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికా చట్టసభ సభ్యురాలు యాంజీ క్రెయిగ్‌పై(Angie Craig) గురువారం జరిగిన దాడి(Attack) కేసులో నిందితుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అతడిని 26 ఏళ్ల కెండ్రిక్ హామ్లిన్‌గా గుర్తించారు. దాడి సమయంలో యాంజీ నిందితుడిపై వేడి వేడి కాఫీ పోసి అతడి నుంచి తప్పించుకున్నారు. అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలైన యాంజీ మిన్నెసొటా(Minnesota) రాష్ట్రంలోని 2వ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాషింగ్టన్‌ డీసీలోని తన అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లోగల లిఫ్ట్‌లో కెండ్రిక్ ఆమెపై దాడి చేశాడు.

ఉదయం ఏడు గంటల సమయంలో ఈ దాడి జరిగింది. తొలుత యాంజీ.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆ యువకుడిని చూశారు. ఆ తరువాత ఆమె లిఫ్ట్‌లోకి వెళుతుండగా అతడూ వెంట వచ్చాడు. యాంజీ అతడికి గుడ్ మార్నింగ్ అని విష్ చేసినా అతడు స్పందించ లేదు. ఆ తరువాత అకస్మా్త్తుగా లిఫ్ట్‌లో వ్యాయామం మొదలెట్టిన అతడు ఆ తరువాత యాంజీ మొహంపై ముష్టి ఘాతాలు కురిపించాడు. అనంతరం ఆమె మెడపై చేతులేసి గట్టిగా పట్టుకున్నాడు. ఈ క్రమంలో అతడికి ఎదురు తిరిగిన యాంజీ తచ చేతిలో ఉన్న వేడి వేడి కాఫీని నిందితుడిపైకి విసిరేసి అక్కడి నుంచి తప్పించుకుంది. అతడు తేరుకునేలోపే అత్యవసర సర్వీసుల సిబ్బందికి సమాచారం అందించింది. అయితే..పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపు నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

నిందితుడి వివరాలు తెలిస్తే చెప్పాలంటూ పోలీసులు అతడి ఫొటో ఇతర వివరాలను విడుదల చేశారు. తాజాగా అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెనుక రాజకీయపరమైన కోణాలేవీ లేవని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. యాంజీ క్షేమంగానే ఉందని, నిందితుడిని ధైర్యంగా ఎదుర్కొందని పలువురు కామెంట్స్ చేశారు. చట్టసభ సభ్యుల భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కాంగ్రెస్ మరిన్ని నిధులు కేటాయించేందుకు అంగీకరించింది. ఇక యాంజీ క్రెయిగ్‌కు నలుగురు పిల్లలున్నారు.

Updated Date - 2023-02-10T16:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising