Mia Khalifa: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై మియా ఖలీఫా సంచలన ట్వీట్.. నెట్టింట్లో తీవ్ర దుమారం
ABN, First Publish Date - 2023-10-08T21:20:50+05:30
ప్రస్తుతం ఇజ్రాయెల్, గాజాలోని హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ) మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తొలుత 5 వేల రాకెట్లతో హమాస్ మెరుపుదాడి చేయగా..
ప్రస్తుతం ఇజ్రాయెల్, గాజాలోని హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ) మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తొలుత 5 వేల రాకెట్లతో హమాస్ మెరుపుదాడి చేయగా.. ఇజ్రాయెల్ సైతం ఎదురుదాడులకు దిగింది. హమాస్‌తో యుద్ధంలో ఉన్నామంటూ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఈ యుద్ధంపై ప్రపంచంలోని వివిధ దేశాలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. దేశాధినేతల దగ్గర నుంచి ప్రముఖుల దాకా.. సోషల్ మీడియా ద్వారా తమ స్పందనని తెలియజేస్తున్నారు. భారత్, అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇజ్రాయెల్‌కి మద్దతు ప్రకటిస్తే.. ఇరాన్, సిరియా, యెమెన్ వంటి అరబ్ దేశాలు హమాస్ దాడిని వెనకేసుకొచ్చాయి.
తాజాగా ఈ దాడిపై ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా సైతం సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యింది. పాలస్తీనాకు మద్దతుగా ఆమె ట్వీట్ చేసింది. ‘‘పాలస్తీనాలోని పరిస్థితులను చూసి ఇప్పటికీ మీరు పాలస్తీనియన్ల వైపు ఉండకపోతే.. మీరు తప్పుడు మార్గంలో ఉన్నారని అర్థం. అలాంటి వారికి కాలమే తగిన సమాధానం చెప్తుంది’’ అంటూ మియా రాసుకొచ్చింది. ఈ ట్వీట్‌ని బట్టి చూస్తే.. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన రాకెట్ దాడిని ఆమె సమర్థిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఒకవైపు అగ్రరాజ్యాలతో పాటు ఇతర ప్రముఖులందరూ హమాస్ చేసిన దాడులకు వ్యతిరేకంగా గళమెత్తుతుంటే.. మియా మాత్రం వారికి మద్దతు ప్రకటించడం నిజంగా సాహసమనే చెప్పుకోవాలి. ఏదేమైనా.. ఈమె చేసిన ఈ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో పెను దుమారానికి దారితీసింది.
తొలుత దాడి చేసింది హమాస్ అని, అలాంటప్పుడు వాళ్లకు మద్దతు ఎలా తెలుపుతావంటూ మియా ఖలీఫాకు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అందుకు మియా సైతం ధీటుగానే బదులిస్తోంది. హమాస్ దాడి ముమ్మాటికీ తప్పేనని వాదిస్తున్న వారికి.. చరిత్రపై జ్ఞానోదయం కూడా కల్పిస్తోంది. ఇజ్రాయిలీలో ప్రస్తుతం ఉన్న ప్రజలు ఎక్కడినుంచో వచ్చి పాలస్తీనాలో స్థిరపడ్డారని.. స్థిరపడిన వారిని పౌరులుగా పరిగణించరంటూ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లా (ఆర్టికల్ 51 (3) ప్రోటోకాల్ 1)ను ఉదహరించింది. పాలస్తీనియుల పట్ల అన్యాయం జరిగిందని.. వారికి మద్దతుగా గళమెత్తాల్సిందేనంటూ మియా చెప్పుకొచ్చింది. ఇదే టైంలో జో బైడెన్‌ని కూడా విమర్శించింది. అరబ్ పౌరులపై బాంబులు వేయడం బైడెన్‌కు ఎంతో ఇష్టమంటూ ధ్వజమెత్తింది.
Updated Date - 2023-10-08T21:20:50+05:30 IST