ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistani Court : ముస్లిం మహిళలను అనవసరంగా నిందించొద్దు : పాకిస్థాన్ షరియా కోర్ట్

ABN, First Publish Date - 2023-04-06T14:10:15+05:30

ముస్లిం మహిళలను అనవసరంగా నిందించవద్దని పాకిస్థాన్‌లోని ఫెడరల్ షరియా కోర్టు స్పష్టం చేసింది. ప్రతి మహిళను

Muslim Women
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇస్లామాబాద్ : ముస్లిం మహిళలను అనవసరంగా నిందించవద్దని పాకిస్థాన్‌లోని ఫెడరల్ షరియా కోర్టు స్పష్టం చేసింది. ప్రతి మహిళను పతివ్రతగానే పరిగణించాలని తెలిపింది. స్వచ్ఛంగా, అణకువగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటించడమే పాతివ్రత్యమని తెలిపింది. వివాహం కాని స్త్రీ, భార్యాభర్తలు ఒకరితో మరొకరు నమ్మకంగా ఉండటం దీనికి ఉదాహరణలని చెప్పింది. ఇస్లామిక్ కాన్సెప్ట్ ‘అల్ ఇహ్సాన్’ ప్రకారం ముస్లిం పురుషులు సాక్ష్యాధారాలు లేకుండా ముస్లిం మహిళల నడవడికను ప్రశ్నించరాదని వివరించింది.

ఖులా పద్ధతిలో 2017లో వివాహం రద్దయిన భార్య ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. తన భర్తతో తన వివాహం రద్దయిన తర్వాత తమ ఇద్దరు కుమారుల కస్టడీ విషయంలో వివాదం తలెత్తినట్లు తెలిపారు. కజ్ఫ్ నేరం (ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ హడ్డ్) ఆర్డినెన్స్, 1979లోని సెక్షన్ 8 ప్రకారం క్రిమినల్ కంప్లయింట్‌ను దాఖలు చేశారు. పిటిషనర్ మాజీ భర్త అసద్ దాఖలు చేసిన పిటిషన్‌లో, తన మాజీ భార్య పాతివ్రత్యాన్ని ప్రశ్నించారు. ఫిర్యాదుదారు, మరో ఇద్దరు సాక్షుల స్టేట్‌మెంట్లను నమోదు చేసిన తర్వాత సెషన్స్ జడ్జి ఈ పిటిషన్‌ను తోసిపుచ్చారు.

పిటిషనర్ మాజీ భర్త ఆమెకు కోర్టులో క్షమాపణ చెప్పారు. తన మాజీ భార్యపై అమర్యాదకరంగా మాట్లాడినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సెషన్స్ జడ్జి తీర్పును రద్దు చేసి, ఈ కేసుపై తదుపరి విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. 90 రోజుల్లోగా తీర్పు చెప్పాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి :

Padma Awards 2023: కన్నుల పండువగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం

AAP : ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు ఢిల్లీ హైకోర్టులో షాక్

Updated Date - 2023-04-06T14:10:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising