మెక్సికోలో వెయ్యేళ్ల నాటి ఏలియన్స్ అవశేషాలు లభ్యం.. గ్రహంతరవాసుల రాకపై కొత్త చర్చ
ABN, First Publish Date - 2023-09-13T17:24:07+05:30
ఏలియన్స్ మనుగడపై అనేక పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులకు ఓ తీపి వార్త అందింది. మెక్సికోలోని ఓ గనుల్లో సుమారు వెయ్యేళ్ల నాటి రెండు ఏలియన్ అవశేషాలు లభించాయి.
ఏలియన్స్.. మనుషుల్లాగా వేరే గ్రహాలపై మనుగడ సాగిస్తున్న జీవులు ఇంకా ఎవరైనా ఉంటారా. ఉంటే ఎలా ఉంటారు.. ఎక్కడ ఉంటారు తదితర ప్రశ్నలు శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తూనే ఉన్నాయి. ఏలియన్స్ మనుగడపై అనేక పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులకు ఓ తీపి వార్త అందింది. మెక్సికోలోని ఓ గనుల్లో సుమారు వెయ్యేళ్ల నాటి రెండు ఏలియన్ అవశేషాలు లభించాయి. మెక్సికో కాంగ్రెస్ లో వీటిని ప్రదర్శనకు ఉంచారు. యూఫాలజిస్ట్, జర్నలిస్ట్ అయిన జైమ్ మౌసాన్ డయాటమ్ గనుల్లో రిసర్చ్ చేస్తుండగా రెండు ఏలియన్స్ శిలాజ అవశేషాలను గుర్తించారు.
వాటిని స్వాధీనపరుచుకుని రేడియోకార్బన్ డేటింగ్ పద్ధతులతో డీఎన్ఏ ఆధారాలను సైంటిస్టులు సేకరించారు. అనంతరం అవి వెయ్యేళ్ల నాటివని గుర్తించి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఇప్పుడు అవే చర్చకు దారి తీశాయి. భూమిపైకి ఏన్నో ఏళ్ల క్రితమే ఏలియన్స్ వచ్చాయా అనే కోణంలో సైంటిస్టులు రిసర్చ్ ప్రారంభించారు. తాజా ఘటన ఏలియన్స్ అన్వేషణ కోసం పరితపిస్తున్న సైంటిస్టుల రిసర్చ్ లకు మరింత ఊతం ఇవ్వనుంది.
Updated Date - 2023-09-13T17:24:32+05:30 IST