ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Trekking: నేపాల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్న వారికో అలర్ట్..

ABN, First Publish Date - 2023-03-13T19:40:21+05:30

నేపాల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్న వారికో ఎలర్ట్. పర్వాతారోహణకు వెళ్లే పర్యాటకుల భద్రత కోసం నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి సోలో ట్రెక్కింగ్‌పై నిషేధం విధుస్తున్నట్టు పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్న వారికో ఎలర్ట్. ట్రెక్కింగ్ కోసం నేపాల్‌కు వచ్చే పర్యాటకుల భద్రత కోసం అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి సోలో ట్రెక్కింగ్‌పై(Solo Trekking) నిషేధం విధుస్తున్నట్టు పేర్కొంది. అంటే.. ఏప్రిల్ 1 నుంచి పర్యాటకులకు ఒంటరిగా పర్వతారోహణకు అనుమతి ఉండదు. వెంట కచ్చితంగా గైడ్ ఉండాలంటూ ప్రభుత్వం నిబంధనలను సవరించింది. ట్రెక్కింగ్‌లో అనుభవజ్ఞులైన విదేశీయులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే.. జాతీయ వనాల వెలుపల ఖాట్మండూ వంటి నగరాల్లో మాత్రం పర్యాటకులు ఒంటరిగా ట్రెక్కింగ్ వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

ఇక 2017లోనే ప్రభుత్వం ఎవరెస్ట్‌ పర్వత పరిసరాల్లో ఒంటరిగా పర్వతారోహణ చేపట్టడంపై నిషేధం విధించింది. పర్యటకుల భద్రత దృష్ట్యా నాటి నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు తాజాగా నిర్ణయించింది. ప్రపంచంలోని తొలి 10 భారీ పర్వతాల్లో ఎనిమిది నేపాల్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ఏటా ఈ పర్వతాల్లో మంచుచరియలు విరిగిపడటం, ముంచు తుఫాన్లు తదితర ప్రకృతి ఉత్పాతాలు సంభవిస్తుంటాయి. కాగా... పర్యాటకుల మేలు కోసమే సోలో ట్రెక్కింగ్‌ను నిషేధించినట్టు నేపాల్ టూరిజం శాఖ డైరెక్టర్ మణిరాజ్ లామిఛానె పేర్కొన్నారు. నేపాల్ పర్యాటక శాఖ లెక్కల ప్రకారం.. 2019లో 50 వేల మంది పర్యాటకులు తమ వెంట గైడ్ లేదా ఇతర సహాయకుడు లేకుండానే ట్రెక్కింగ్ చేశారు.

Updated Date - 2023-03-13T21:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising