Osama Bin Laden: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఒసామా బిన్ లాడెన్ లేఖ వైరల్
ABN, First Publish Date - 2023-11-16T16:59:22+05:30
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. అల్‌ఖైదా నాయకుడు, 9/11 దాడుల ప్రధాన సూత్రధాని ఒసామా బిన్ లాడెన్ రాసిన ‘అమెరికన్ ప్రజలకు లేఖ’ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిక్-టాకర్స్ ఈ లేఖను షేర్ చేస్తూ..
Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. అల్‌ఖైదా నాయకుడు, 9/11 దాడుల ప్రధాన సూత్రధాని ఒసామా బిన్ లాడెన్ రాసిన ‘అమెరికన్ ప్రజలకు లేఖ’ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిక్-టాకర్స్ ఈ లేఖను షేర్ చేస్తూ.. కొందరు లాడెన్‌తో ఏకీభవిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకే రోజులో వేలాది మంది టిక్‌టాక్ వినియోగదారులు తమ క్లిప్‌లను పంచుకోవడంతో.. ఒసామా లేఖ వీడియోలు వైరల్‌గా మారాయి. దీనిని ప్రజలు ‘TikTok PsyOp సునామీ’ అనే పేరు పెట్టారు.
ఇంతకీ ఆ లేఖలో బిన్ లాడెన్ ఏం రాశాడు?
అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్.. 9/11 దాడుల తర్వాత ఈ లేఖ రాశాడు. ఈ లేఖ 9/11 దాడుల్ని సమర్థించడానికి ప్రయత్నిస్తుంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణను కూడా బిన్ లాడెన్ అందులో ప్రస్తావిస్తూ.. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చినందుకే 9/11 దాడులకు కారణమంటూ తెలిపాడు. ‘‘మా పాలస్తీనాను ఆక్రమించడంలో మీరు అణచివేత ఇజ్రాయిలీలకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. పాలస్తీనా దశాబ్దాలుగా ఆక్రమణలో ఉంది. 2001 సెప్టెంబర్ 11న జరిగిన దాడుల తర్వాత.. మీ అణచివేత, మాపై దౌర్జన్యమే ఈ దాడికి కారణమని జార్జ్ బుష్ గ్రహించేదాకా ఎవ్వరూ పాలస్తీనా సమస్య గురించి మాట్లాడలేదు’’ అని రాశాడు. పాలస్తీనా భూమిని తిరిగిచ్చే రోడ్ మ్యాప్‌ని అమలు చేయాలని, ఇదొక ఇస్లామిక్ భూమి అని బిన్ లాడెన్ తెలిపాడు. అంతేకాదు.. పాలస్తీనాను ఎవరూ బందీ చేయలేరని, దాని సంకెళ్ళను విచ్ఛిన్నం చేయడానికి తాము ప్రయత్నిస్తామని ఆ లేఖలో చెప్పాడు. యునైటెడ్ స్టేట్స్ క్రైస్తవుల రక్తంతో దాని దురహంకారానికి మూల్యం చెల్లించుకుంటుందని కూడా హెచ్చరించాడు.
ప్రస్తుతం ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల కారణంగా గాజాలో సామాన్య పౌరులు.. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు మరణిస్తుండటంతో.. కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ లేఖ బయటకు రావడంతో, ఇది వైరల్‌గా మారింది. గతంలో పాలస్తీనాపై దురాక్రమణకు పాల్పడ్డ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం వల్లే 9/11 దాడులు జరిపామని బిన్‌లాడెన్ ఆ లేఖలో పేర్కొనడాన్ని.. చాలామంది ఏకీభవించారు. దీంతో.. ఈ లేఖను 2002 నవంబర్‌లో తన వెబ్‌సైట్‌లో పెట్టిన ‘ద గార్డియన్’ వెబ్‌సైట్ ఇప్పుడు (2023 నవంబర్ 15వ తేదీన) తొలగించింది.
Updated Date - 2023-11-16T16:59:23+05:30 IST