ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Italy: పడవ ధ్వంసం.. 43 మంది జల సమాధి

ABN, First Publish Date - 2023-02-26T20:55:42+05:30

పడవ(Boat) ధ్వంసమైన తర్వాత 80 మంది అతి కష్టం మీద తీరానికి చేరుకోగలిగారని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోమ్: వలసదారులతో వెళ్తున్న పడవ ధ్వంసమైన ఘటనలో 43 మంది జల సమాధి అయ్యారు. ఇటలీ(Italy)లో జరిగిందీ ఘటన. పడవ(Boat) ధ్వంసమైన తర్వాత 80 మంది అతి కష్టం మీద తీరానికి చేరుకోగలిగారని, 43 మంది మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చినట్టు ఇటలీ కోస్టుగార్డు తెలిపింది. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని( Giorgia Meloni) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.

66 అడుగుల పొడవున్న పడవలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బాధితులు ప్రయాణించినట్టు ప్రధాని కార్యాలయం తెలిపింది. కాలాబ్రియాలోని తీరప్రాంత పట్టణమైన క్రోటోన్ సమీపంలో అయోనియన్ సముద్రంలో ఈ దుర్ఘటన జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. ప్రమాద సమయంలో పడవలో 120 మందికిపైగా ఉన్నట్టు పేర్కొంది. అంతేకాదు, మృతుల్లో కొన్ని నెలల పసిపాప కూడా ఉన్నట్టు తెలిపింది.

మృతులు ఏ దేశానికి చెందినవారు? ఎక్కడికి వెళ్తున్నారనే వివరాలు తెలియరాలేదు. కాగా, గల్లంతైన వారి కోసం కోస్టుగార్డు బృందాలు హెలికాప్టర్లు, మోటార్ బోట్లను రంగంలోకి దించాయి. కాలాబ్రియా తీరప్రాంతంలో భాగమైన స్టెక్కాటో డి కుట్రోకు ధ్వంసమైన పడవలోని ఓ భాగం కొట్టుకొచ్చింది.

Updated Date - 2023-02-26T20:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising