ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

OpenAI: నాటకీయ పరిణామాల మధ్య... ఓపెన్ ఏఐ సీఈవోగా తిరిగి వచ్చిన ఆల్ట్ మాన్

ABN, First Publish Date - 2023-11-22T15:48:16+05:30

ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు ఆల్ట్ మాన్(Sam Altman) ఎట్టకేలకు ఏఐ కంపెనీకి తిరిగి వస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. అయిదు రోజుల నాటకీయ పరిణామాల తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

న్యూయార్క్: ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు ఆల్ట్ మాన్(Sam Altman) ఎట్టకేలకు ఏఐ కంపెనీకి తిరిగి వస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. అయిదు రోజుల నాటకీయ పరిణామాల తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

"నేను ఓపెన్ ఏఐని ప్రేమిస్తున్నాను. కొన్ని రోజులుగా చేసిందంతా కంపెనీ బృందాన్ని ఒక చోట చేర్చడానికే. కంపెనీలో నా భాగస్వామ్యం పెంచడానికి ఎదురు చూస్తున్నాను" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఏఐ స్టార్టప్ లు కూడా ఈ వార్తలు నిజమేనని ధ్రువీకరించాయి. గత వారం ఓపెన్ ఏఐ నుంచి ఆల్ట్ మాన్(OpenAI)ని అకస్మాత్తుగా తొలగించారు. అనంతరం 5 రోజుల చర్చల తరువాత ఆయన తిరిగి వస్తున్నారు. అమెరికా స్టార్టప్ ఓపెన్ ఏఐ ఆయన తిరిగి రావడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. బోర్డులో కూడా స్వల్ప మార్పులు చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

ఇందులో భాగంగా కొందరు అధికారులను తప్పించనున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ సంస్థ మైక్రో సాఫ్ట్ ఓపెన్ ఏఐలో 49 శాతం వాటా కలిగి ఉంది. 2015లో ప్రారంభించిన ఓపెన్ ఏఐ కంపెనీలో ఈ కుదుపులు తొలి సారి కాదు. 2020లో కూడా ఎగ్జిక్యూటివ్ లు రిజైన్ చేశారు. ఆల్ట్ మాన్ గత సంవత్సరం చాట్ జీపీటీని ప్రారంభించి సంచలనం సృష్టించారు. ఇది ఏఐ(AI) పరిశోధన, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడింది. ఈ రంగంలో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేలా కంపెనీలు ఆసక్తి చూపేలా చేసింది.

Updated Date - 2023-11-22T15:48:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising