Starvation Deaths: ఆకలితో చస్తే జీసస్‌ను కలవొచ్చంటూ దుష్ప్రచారం.. ప్రాణాలు తీసుకుంటోన్న భక్తజనం
ABN, First Publish Date - 2023-04-24T20:29:35+05:30
ఆహారం తీసుకోకుండా ప్రాణాలు కోల్పోతే (starvation deaths) జీసస్‌ను కలవొచ్చంటూ ఓ మత పెద్ద చేసిన ప్రచారంతో పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు ప్రాణాలు తీసుకుంటున్నారు.
కెన్యా: ఆహారం తీసుకోకుండా ప్రాణాలు కోల్పోతే (starvation deaths) జీసస్‌ను కలవొచ్చంటూ ఓ మత పెద్ద చేసిన ప్రచారంతో పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కెన్యాలో (Kenya) జరుగుతోన్న ఈ తతంగం ప్రపంచం నివ్వెరపోయేలా చేస్తోంది. పాల్ మెకంజీ (Paul Mackenzie) అనే క్రైస్తవ మత పెద్ద భక్తులను ఈ ఉన్మాదానికి పురికొల్పాడు. దీంతో గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్‌కు వచ్చే చాలా మంది భక్తులు షాకహోలా అటవీ ప్రాంతంలో ఆకలితో ఉంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. 800 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఇందు కోసం ఎంచుకున్నారు. పోలీసులు ఈ ప్రాంతాన్ని సీజ్ చేశారు.
పోలీసులు ఇప్పటివరకూ 67 మృత దేహాలను వెలికితీశారు. మరిన్ని సమాధులను గుర్తించినట్లు వెల్లడించారు. ఒక సమాధిలో ఐదు మృతదేహాలు ఉండటంతో కుటుంబసభ్యులంతా ఆకలి మరణాలు పొందినట్లు తెలుసుకున్నారు. మొత్తం 29 మందిని పోలీసులు కాపాడారు. ఇంకా 112 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. వీరి కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. స్థానిక ఆసుపత్రుల్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ చేస్తున్నారు.
మరోవైపు మెకంజీని పోలీసులు ఏప్రిల్ 14న అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది. కెన్యా మీడియా ప్రకారం మెకంజీ కూడా ఆహారం, నీరు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని సమాచారం. మెకంజీ బోధనలపై కెన్యా అధ్యక్షుడు విలియమ్ రుటో (William Ruto) అభ్యంతరం వ్యక్తం చేశారు. మెకంజీ నేరస్థుడని రుటో చెప్పారు.
Updated Date - 2023-04-24T21:01:22+05:30 IST