ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel-Hezbollah: హిజ్బుల్లా చీఫ్‌పై ఇజ్రాయెల్ సెటైర్లు.. అతని స్పీచ్‌రైటర్ చంపబడ్డాడేమోనంటూ ఎగతాళి

ABN, First Publish Date - 2023-11-04T17:37:29+05:30

ఇటీవల హమాస్‌కి మద్దతుగా ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇస్తూ ప్రసంగించిన హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాపై ఇజ్రాయెల్ సెటైర్లు వేసింది. అతని ప్రసంగం బోరింగ్‌గా, చాలా సుదీర్ఘంగా, గందరగోళంగా ఉందంటూ ఎగతాళి...

ఇటీవల హమాస్‌కి మద్దతుగా ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇస్తూ ప్రసంగించిన హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాపై ఇజ్రాయెల్ సెటైర్లు వేసింది. అతని ప్రసంగం బోరింగ్‌గా, చాలా సుదీర్ఘంగా, గందరగోళంగా ఉందంటూ ఎగతాళి చేసింది. అతడు బహిరంగ సభలో ప్రసంగించకుండా.. ఒక పిరికివాడలా బంకర్‌లో దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి ఐలాన్ లెవీ హిజ్బుల్లా చీఫ్‌పై నిప్పులు చెరిగారు. అతని స్థానంలో తానుంటే.. బహిరంగ ప్రదేశంలోనే ప్రసంగం ఇచ్చేవాడినని ఆయన పేర్కొన్నాడు.

ఓ మీడియాతో ఐలాన్ లెవీ మాట్లాడుతూ.. ‘‘మేము హసన్ నస్రల్లా ప్రసంగం విన్నాం. అది చాలా సుదీర్ఘంగా, ఎలాంటి స్పష్టత లేకుండా గందరగోళంగా ఉంది. నాకైతే అతని ప్రసంగం చాలా బోరింగ్‌గా అనిపించింది. బహుశా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చేసిన వైమానిక దాడుల్లో హసన్ స్పీచ్‌రైటర్ మరణించి ఉండొచ్చు’’ అని చెప్పారు. పెద్ద సంఖ్యలో జనాలు ఉన్నప్పటికీ, హసన్ స్వయంగా వేదికపై లేకపోవడాన్ని తాను గమనించానన్నారు. అతడు పిరికివాడిలా ఒక బంకర్‌లో దాక్కున్నాడని.. ఒకవేళ హమాస్ పెడోఫిలే రేపిస్టులను సమర్థిస్తూ నేను సుదీర్ఘమైన ప్రసంగం చేస్తే మాత్రం పబ్లిక్‌లో తన ముఖం చూపించేందుకు భయపడేవాడినని చెప్పుకొచ్చాడు.


ఇదిలావుండగా.. తన సుదీర్ఘ వర్చువల్ ప్రసంగంలో నస్రల్లా అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడిని ప్రశంసించాడు. ఎంతో గొప్పదైన ఈ భారీస్థాయి ఆపరేషన్ పాలస్తీనా ప్రణాళిక, అమలు ఫలితమని ఆ ప్రసంగంలో చెప్పాడు. చాలా రహస్యంగా ఈ విషయాన్ని దాచి ఉంచడం వల్లే.. ఆపరేషన్ విజయవంతం అయ్యిందని కొనియాడాడు. అయితే.. ఈ ఎటాక్‌లో తమ పాత్ర ఏమాత్రం లేదని క్లారిటీ ఇచ్చాడు. సాలీడు వలయం (స్పైడర్ వెబ్) కంటే ఇజ్రాయెల్ బలహీనంగా ఉందనడానికి అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి రుజువని చెప్పాడు. నెల రోజుల నుంచి యుద్ధం జరుగుతున్నా.. ఇందులో ఇజ్రాయెల్ ఏం సాధించలేకపోయిందన్నాడు.

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడుల కారణంగా అక్కడ 9,000 మంది కంటే ఎక్కువ మంది పౌరులు చనిపోయారని.. ఈ దాడిలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఉందని నస్రల్లా ఆరోపణలు చేశాడు. ఈ విధంగా నస్రల్లా ఇచ్చిన ప్రసంగం.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరాటం ప్రాంతీయ యుద్ధంగా మారుతుందా? అనే అనుమానానికి సంకేతాలిస్తోంది. అటు.. హమాస్ నాయకులు ఈ యుద్ధంలో తమకు మద్దతుగా రంగంలోకి దిగాలని హిజ్బుల్లాపై ఒత్తిడి చేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలు, హిజ్బుల్లా యోధులు సరిహద్దు ఘర్షణలలో నిమగ్నమై ఉన్నారు.

Updated Date - 2023-11-04T17:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising