ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Venezuela Accident: 15 నిమిషాల్లో 2 ప్రమాదాలు.. కాలి బూడిదైన 17 వాహనాలు.. అసలేమైంది?

ABN, Publish Date - Dec 14 , 2023 | 03:27 PM

వెనిజులా రాజధాని కారకాస్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బుధవారం సాయంత్రం కారకాస్ సమీపంలోని హైవైపై రోడ్డు ప్రమాదం జరగ్గా.. 17 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు.

Venezuela Accident: వెనిజులా రాజధాని కారకాస్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బుధవారం సాయంత్రం కారకాస్ సమీపంలోని హైవైపై రోడ్డు ప్రమాదం జరగ్గా.. 17 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తొలుత ఆ హైవైపై చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. దాని కారణంగా ఆ రహదారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సరిగ్గా 15 నిమిషాల తర్వాత ఒక లారీ వేగంగా దూసుకొచ్చి.. ఆగి ఉన్న వాహనాల్ని ఢీకొట్టింది. ఆ ట్రక్కులో రసాయనాలు ఉండటంతో.. మంటలు చెలరేగి వాహనాలకు వ్యాపించాయి. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.


ఒకేసారి కొన్ని వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొనడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. తొలుత ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందని, ఆ తర్వాత లారీ దూసుకురావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొన్నారు. ఢీకొట్టిన ట్రక్కులో రసాయనాలు ఉండటంతో మంటలు వ్యాపించాయన్నారు. సమాచారం అందిన వెంటనే అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుందని.. ముందుగా గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారని వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ 16 మృతదేహాలు వెలికితీశామని, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పరిస్థితి చూస్తుంటే.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఇందుకు గల కారణాలేంటన్న విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.

ఈ ప్రమాదంపై వెనిజులా రిస్క్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ మంత్రి మాట్లాడుతూ.. మొదటి ప్రమాదంలో ఒక ట్రక్కు, 3 వాహనాలు ఢీకొన్నాయన్నారు. దీంతో హైవైపై ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని వివరించారు. తద్వారా రహదారిలో అనేక వాహనాలు నిలిచిపోయాయని తెలిపారు. ఇంతలో ఒక లారీ అత్యంత వేగంగా దూసుకొచ్చి వాహనాల్ని ఢీకొందని చెప్పారు. చెడు వాతావరణం కారణంగా ఈ ట్రాఫిక్ జామ్‌ని డ్రైవర్ చూడలేకపోయి ఉండొచ్చని అన్నారు. అయితే.. ప్రజల వాదన మాత్రం మరోలా ఉంది. హైవే రోడ్డు సరిగా లేదని, నిర్వహణ కూడా బాగోలేదని వాపోతున్నారు. కాగా.. అక్టోబర్ 28న ఈజిప్టులోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. బహెరా ప్రాంతంలోని హైవేపై వాహనాలు ఒకదాంతో మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 35 మంది మరణించగా, 63 మంది గాయపడ్డారు.

Updated Date - Dec 14 , 2023 | 03:27 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising