ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Isreal-Hamas War: రక్తపాతాన్ని ఆపడం ముఖ్యం, అందుకు మేము సిద్ధమే.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంపై పుతిన్

ABN, First Publish Date - 2023-10-13T22:20:20+05:30

పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ తమపై మెరుపుదాడులు చేయడం, తమ దేశ పౌరుల్ని కిడ్నాప్ చేయడంతో.. ఇజ్రాయెల్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటోంది. హమాస్‌ని పూర్తిగా తుడిచిపెట్టాలన్న ఉద్దేశంతో దూసుకుపోతోంది...

పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ తమపై మెరుపుదాడులు చేయడం, తమ దేశ పౌరుల్ని కిడ్నాప్ చేయడంతో.. ఇజ్రాయెల్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటోంది. హమాస్‌ని పూర్తిగా తుడిచిపెట్టాలన్న ఉద్దేశంతో దూసుకుపోతోంది. హమాస్ నియంత్రణలో ఉన్న గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు బందీలను విడిపించుకునేందుకు గాను గాజాలో గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు కూడా ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతోంది. అయితే.. ఈ ఆపరేషన్ నిర్వహిస్తే గాజాలో భారీగా ప్రాణనష్టం జరుగుతుందని, ఇది ఏమాత్రం ఆమోదించదగినది కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెలిపారు.


నివాస ప్రాంతాలలో భారీ యంత్రాలను ఉపయోగించడం సంక్లిష్టమైన విషయమని, ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని పుతిన్ అన్నారు. ముఖ్యంగా.. పౌర ప్రాణనష్టం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ఇప్పుడు రక్తపాతాన్ని ఆపడమే అత్యంత ముఖ్యమైన విషయమని.. ఇరుపక్షాలు ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. తమ రష్యా మధ్యవర్తిత్వం వహించేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. హమాస్ చేసిన క్రూరమైన దాడుల నుంచి తనని తాను కాపాడుకునే హక్కు ఇజ్రాయెల్‌కి ఉందని, కానీ పౌరుల ప్రాణనష్టం జరగడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. తమ దేశం అన్ని భాగస్వాములతో సమన్వయం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని.. రెండు దేశాల పరిష్కారానికి రష్యా మద్దతిస్తుందని చెప్పారు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై రష్యా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇరువైపుల నుంచి హింసను ఖండించింది. అంతేకాదు.. ఈ సంఘర్షణకు అమెరికా విధానాలకే కారణమని నిందించింది. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా అనుసరిస్తున్న విధానాల వల్లే ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిందని పుతిన్ ఆరోపించారు. పాలస్తీనా ప్రజల ప్రయోజనాలకు ఆ అగ్రరాజ్యం పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు.

Updated Date - 2023-10-13T22:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising