ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vladimir Putin: ఎనిమిది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ వింత విజ్ఞప్తి

ABN, First Publish Date - 2023-12-01T20:03:55+05:30

ఒకవైపు మన దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతుంటే.. మరోవైపు కొన్ని దేశాల్లో మాత్రం జననాల రేటు విపరీతంగా తగ్గిపోతుంది. అలాంటి వాటిల్లో రష్యా కూడా ఒకటి. 1990 నుంచి అక్కడ జననాల రేటు పడిపోతూ వస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం...

Vladimir Putin To Russian Women: ఒకవైపు మన దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతుంటే.. మరోవైపు కొన్ని దేశాల్లో మాత్రం జననాల రేటు విపరీతంగా తగ్గిపోతుంది. అలాంటి వాటిల్లో రష్యా కూడా ఒకటి. 1990 నుంచి అక్కడ జననాల రేటు పడిపోతూ వస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యాలో 3,00,000 కంటే ఎక్కువ మంది మరణించినట్లు ఒక నివేదిక కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే.. తమ దేశ జనాభా పెంచుకోవడం కోసం ఆ దేశం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిగొచ్చి.. రష్యన్ మహిళలకు వింత విజ్ఞప్తి చేశారు. దేశంలోని మహిళలు ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని.. పెద్ద కుటుంబాలుగా విస్తరించాలని కోరారు. ఇటీవల రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ‘వరల్డ్‌ రష్యన్‌ పీపుల్’ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.


వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని దేశ మహిళలను కోరారు. పాత తరం ప్రజలు నలుగురు లేదా ఐదుగురు పిల్లల్ని కనడం వల్లనే మన సమాజం బలంగా ఏర్పడిందని అన్నారు. అమ్మమ్మలు, నానమ్మలకు ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉండేవారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని కాపాడుకుందామని.. దాన్ని పునరుజ్జీవింపజేద్దామని పిలుపునిచ్చారు. పెద్ద కుటుంబాలు రష్యా ప్రజలందరికీ కట్టుబాటు, జీవన విధానంగా మారాలన్నారు. కుటుంబం అనేది కేవలం సమాజానికి పునాది మాత్రమే కాదని.. ఆధ్యాత్మికతకు, నైతికతకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల వారు రష్యా జనాభాను సంరక్షించడం, పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని.. తద్వారా ప్రపంచంలో రష్యా మరింత బలోపేతం అవుతుందని పుతిన్ చెప్పుకొచ్చారు.

ఇదిలావుండగా.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యన్స్ మరణించిన సంఖ్య సుమారు 3,00,000 దాడి ఉంటుందని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే.. 8,20,000 నుంచి 9,20,000 మంది వరకు రష్యన్ పౌరులు దేశం విడిచి పారిపోయి ఉంటారని ‘రష్యా పాలసీ గ్రూప్‌’ పేర్కొంది. దీనికితోడు.. ఉక్రెయిత్‌తో యుద్ధం కారణంగా పలు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో, రష్యా తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కారణమవుతోందని అంతర్జాతీయ ఆర్థిక రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే.. దేశ జనాభాను పెంచడంలో ఆ దేశం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని మహిళలకు పిలుపునిస్తోంది. 2023 జనవరి 1న రష్యా జనాభా 146,447,424గా ఉంది. 1999లో పుతిన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఆ సంఖ్య తగ్గుతూ వస్తోందని ఓ నివేదిక వెల్లడించింది.

Updated Date - 2023-12-01T20:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising