ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vladimir Putin: ఫిన్‌లాండ్ నాటో ఒప్పందంపై పుతిన్ ఫైర్.. జో బైడెన్‌కి కౌంటర్

ABN, Publish Date - Dec 17 , 2023 | 07:58 PM

ఈ ఏడాది ప్రారంభంలో నాటోలో అధికారికంగా చేరిన పొరుగు దేశం ఫిన్లాండ్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఆదివారం రోసియా స్టేట్ టెలివిజన్‌లో ప్రచురించిన ఒక ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ.. గతంలో పిన్‌లాండ్‌తో ఎలాంటి సమస్యలు లేవని...

Vladipur Putin Warns Finland: ఈ ఏడాది ప్రారంభంలో నాటోలో అధికారికంగా చేరిన పొరుగు దేశం ఫిన్లాండ్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఆదివారం రోసియా స్టేట్ టెలివిజన్‌లో ప్రచురించిన ఒక ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ.. గతంలో పిన్‌లాండ్‌తో ఎలాంటి సమస్యలు లేవని, ఉన్న సమస్యల్ని కూడా పరిష్కరించుకున్నామని, కానీ ఆ దేశం నాటోలో చేరిన తర్వాత సమస్యలు మొదలు అవుతాయని ఆయన కుండబద్దలు కొట్టాడు.

‘‘ఈ ఏడాది ప్రారంభంలో నాటోలో ఫిన్‌లాండ్‌ను చేర్చుకున్నారు. వారితో మాకు ఏమైనా వివాదం ఉందా? అంటే.. 20వ శతాబ్దం మధ్యలో కొన్ని ప్రాదేశిక వివాదాలతో పాటు ఇతర సమస్యలు ఉండేవి. అయితే.. ఆ వివాదాలన్నీ చాలావరకు పరిష్కరించబడ్డాయి. నాటోలో ఆ దేశం చేరే ముందు వరకూ ఎటువంటి సమస్య లేదు. కానీ.. ఇకపై సమస్యలు ఉంటాయి’’ అని పుతిన్ హెచ్చరించారు. తాము అక్కడ లేనిన్‌గ్రాడ్ మిలిటరీ డిస్ట్రిక్ట్‌ను సృష్టిస్తామమని, నిర్దిష్ట సంఖ్యలో సైనిక విభాగాలను కేంద్రీకరిస్తామని ఆయన వివరించారు. రష్యాతో సరిహద్దుని మూసివేశాక దాని సరిహద్దులో వలస సంక్షోభాన్ని సృష్టిస్తోందని ఫిన్‌లాండ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. రష్యా అధ్యక్షుడు ఈ వార్నింగ్ జారీ చేశాడు.


ఫిన్‌లాండ్‌కు పుతిన్ వార్నింగ్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన గట్టిగానే హెచ్చరించారు. నాటోలో ఫిన్‌లాండ్ చేరబోతోందని విషయం తెలిసినప్పుడు.. ఆ పని చేయొద్దని రష్యా పేర్కొంది. ఇక తన ప్రసంగం ముగించే సమయంలో.. నాటో దేశాలతో రష్యా యుద్ధం చేయడానికి ఎలాంటి కారణాలు లేవని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వాదన పూర్తిగా అర్ధం లేనిదని పుతిన్ పేర్కొన్నారు. కాగా.. గతంలో ఉక్రెయిన్‌పై పుతిన్ గెలిస్తే, నాటో దేశంపై రష్యా దాడి చేస్తుందని ఈ నెల ప్రారంభంలో బిడెన్ వ్యాఖ్యానించారు. ఆ వాదనని తిప్పికొడుతూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఇదలావుండగా.. రష్యాతో 1,340 కిలోమీటర్ల (830-మైలు) సరిహద్దును ఫిన్‌లాండ్ పంచుకుంటోంది. గతంలో ఈ ఇరు దేశాల మధ్య విభేదాలున్నా.. క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే.. నాటోలో చేరాలని ఫిన్‌లాండ్ నిర్ణయించినప్పుడు.. రష్యా నుంచి వార్నింగ్ వచ్చింది. అయినప్పటికీ.. ఫిన్‌లాండ్ ఆ వార్నింగ్‌ని లెక్క చేయకుండా ఈ ఏడాది ప్రారంభంలో నాటోలో చేరింది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా బిజీగా ఉండటంతో.. వీలు చూసుకొని ఫిన్‌లాండ్ నాటోలో చేరిపోయింది. ఇది రష్యా అధ్యక్షుడికి పెద్ద దెబ్బగా పరిగణించబడింది.

Updated Date - Dec 17 , 2023 | 07:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising