ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hamas vs Israel: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి కారణమేంటి? హమాస్ లక్ష్యం ఏంటి? దాని వెనుక ఎవరున్నారు?

ABN, First Publish Date - 2023-10-08T15:11:24+05:30

శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై గాజా స్ట్రిప్ నుంచి హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్) మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5వేలకు పైగా రాకెట్లను...

శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై గాజా స్ట్రిప్ నుంచి హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్) మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5వేలకు పైగా రాకెట్లను ప్రయోగించింది. అంతేకాదు.. హమాస్ యోధులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి, స్థానిక ప్రజలపై దాడికి దిగారు. కొందరు ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా చేసుకున్నారు. దీంతో తీవ్రంగా మండిపడ్డ ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులకు దిగొచ్చింది. బార్డర్ ప్రాంతంలో ఇజ్రాయిల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర పోరు కొనసాగుతుండగా.. ఇజ్రాయెల్ వైమానిక దళాలు గాజాపై ఎటాక్ చేస్తున్నారు. ఇలా పరస్పర దాడుల్లో 500 మందికి పైగా మృతి చెందారు.


అసలు హమాస్ గ్రూప్ ఏంటి?

1987లో అహ్మద్ యాసిన్, అబ్దెల్ అజీజ్ అల్-రాంటిస్సీ కలిసి ఈ మిలిటెంట్ గ్రూప్‌ని ‘ఈజిప్షియన్ ముస్లిం బ్రదర్‌హుడ్’ విభాగంగా స్థాపించారు. హమాస్ అంటే హర్కత్ అల్-ముక్వామా అల్-ఇస్లామియా.. అంటే ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ అని అర్థం. సింపుల్ భాషలో చెప్పాలంటే.. ‘హమాస్’ అంటే ఉత్సాహం. పాలస్తీనాకు విముక్తి కల్పించడం.. ఇజ్రాయెల్ ఆక్రమించిన భూభాగంతో పాటు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లను కలిపి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే ఈ గ్రూప్ లక్ష్యమని 1988లో హమాస్ చార్టర్ పేర్కొంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఈ హమాస్ సంస్థ ఇజ్రాయెల్ ముందు ఒక ప్రతిపాదన పెట్టింది. 1967కి ముందు సరిహద్దులకు వెనుదిరిగడంతో పాటు నష్టపరిహారం చెల్లించి, పాలస్తీనా శరణార్థులను తిరిగి రావడానికి అనుమతిస్తే.. తాము సంధిని అంగీకరిస్తామని తెలిపింది. అంతేకాదు.. ముస్లిం బ్రదర్‌హుడ్‌తో సంబంధాలకు స్వస్తి పలుకుతామని కూడా హామీ ఇచ్చింది. కానీ.. హమాస్ వాదనల్ని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది.

హమాస్ వెనుక ఎవరున్నారు?

ఈ హమాస్ గ్రూపులో సాంస్కృతిక విభాగం, సైనిక విభాగం, ఇజ్ అద్-దిన్ అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ ఉన్నాయి. ఈ హమాస్‌కు ఇరాన్ మద్దతు తెలుపుతోంది. ఇరాన్, సిరియా, లెబనాన్‌లోని ఇస్లామిస్ట్ గ్రూప్ హిజ్బుల్లాతో కూడిన కూటమిలో ఈ హమాస్ సంస్థ ఒక భాగం. ఈ కూటమిలో ఉండే సభ్యులందరూ.. తమ రీజన్‌లోని యూఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడులకు ఇరాన్, సిరియా, యెమెన్ తమ మద్దతు ప్రకటించాయి. హమాస్ చేసిన ఈ దాడులు గర్వించదగినవి, వీరోచితమైనవంటూ ఆ దేశాలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితికి ఇజ్రాయెల్ మాత్రమే బాధ్యత వహించాలని ఖతార్ పేర్కొనగా.. అరబ్ లీగ్, జోర్డాన్ సైతం ఇజ్రాయెల్ విధానాలపై గళమెత్తాయి. ఈజిప్టు, మొరాకో, సౌదీ అరేబియా దేశాలు కూడా సంయమనం పాటించాలని పిలుపునిచ్చాయి.


హమాస్‌పై ఉగ్రవాద ముద్ర

నిజానికి.. గతంలో ఇజ్రాయెల్ అనే దేశమే ఉండేది కాదు. కేవలం పాలస్తీనా మాత్రమే ఉండేది. కానీ.. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో యూరప్‌లో ఉండే యూదులంతా ప్రాణభయంతో పాలస్తీనాకు వచ్చారు. అప్పట్లో పాలస్తీనాలో అరబ్బులు ఎక్కువ మోతాదులో ఉంటే, యూదులు తక్కువ సంఖ్యలో ఉండేవారు. అయితే.. క్రమంగా యూదులు సంఖ్య పెరుగుతూ వచ్చింది. వీళ్లంతా ఇతర ప్రాంతాల నుంచి పాలస్తీనాకు తరలివచ్చారు. తమ సంఖ్యాబలం పెరిగాక.. ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించారు. ఆశ్రయం కోసం తమ ఇంటికొచ్చిన యూదులు.. ఇంటినే కొల్లగొట్టడాన్ని చూసి తట్టుకోలేక వారి ప్రకటనని పాలస్తీనియన్లు వ్యతిరేకించారు. అప్పటి నుంచి వీరి మధ్య యుద్ధం జరుగుతూ వస్తోంది. పాలస్తీనియన్లకు మద్దతుగా హమాస్ గ్రూపు పోరాటం చేస్తోంది. అయితే.. ఇజ్రాయెల్, యూఎస్, యూరోపియన్ యూనియన్, కెనడా, ఈజిప్ట్, జపాన్‌ వంటి దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.

హమాస్ Vs ఫతా

1990లలో పారామిలటరీ సంస్థగా ‘ఫతా’ ఏర్పడింది. దీనిని యాసర్ అరాఫత్ స్థాపించారు. 1967 సరిహద్దుల ప్రకారం ఇజ్రాయెల్ రాష్ట్రంతో పాటు పాలస్తీనా రాజ్యాన్ని నిర్మించాలనే UN భద్రతా మండలి తీర్మానానికి ఇది మద్దతు ఇచ్చింది. ఇజ్రాయెల్‌తో గొడవలు పడకుండా.. పరిష్కార మార్గాల్ని అన్వేషించేందుకు గాను ఈ సంస్థ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కానీ.. ఫతా విధానాలు హమాస్‌కు నచ్చలేదు. దీంతో.. ఈ రెండు గ్రూపుల మధ్య కూడా పోరాటం సాగుతూ వస్తోంది. హమాస్ తనని తాను ఇస్లామిస్ట్‌గా గుర్తిస్తే.. పతా లౌకికవాదాన్ని సమర్థిస్తుంది. ఇజ్రాయెల్‌కి విరుద్ధంగా హమాస్ పావులు కదుపుతుంటే.. ఫతా మాత్రం చర్చల ద్వారా పరిష్కార మార్గం కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది. 2004లో అరాఫత్ మరణించాక హమాస్ మరింత బలవంతంగా తయారైంది. 2007లో ఫతాతో అంతర్యుద్ధం జరిగిన తర్వాత గాజా స్ట్రిప్‌ని హమాస్ స్వాధీనం చేసుకుంది. అయితే.. ఫతా మాత్రం వెస్ట్ బ్యాంక్‌లో అధికారం కలిగి ఉంది. 2021-22 పాలస్తీనా స్థానిక ఎన్నికలను సైతం హమాస్ బహిష్కరించింది.

Updated Date - 2023-10-08T15:11:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising