Turkey - Syria Earthquake: చావుతో 22 గంటల పాటు పోరాడిన మహిళ.. చివరకు..
ABN, First Publish Date - 2023-02-07T12:24:04+05:30
సోమవారం ఉదయం సెంట్రల్ టర్కీ - సిరియా సరిహద్దులో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఓ మహిళ శిథిలాలో చిక్కుకుపోయి దాదాపు 22 గంటల పాటు చావుతో పోరాడింది.
Turkey - Syria Earthquake: సోమవారం ఉదయం సెంట్రల్ టర్కీ - సిరియా సరిహద్దులో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఓ మహిళ శిథిలాలో చిక్కుకుపోయి దాదాపు 22 గంటల పాటు చావుతో పోరాడింది. చివరకు సజీవంగా బయటకు వచ్చింది. ఈ ఘటన రెస్క్యూవర్స్‌కు సైతం ఆనందభాష్పాలు తెప్పించింది. టర్కిష్ మీడియా సర్వీస్ అండలౌ కథనం మేరకు.. ఆగ్నేయ ప్రావిన్స్ సాన్లియుర్ఫాలో శిధిలాల నుంచి ఒక గుర్తు తెలియని మహిళను రెస్క్యూ సిబ్బంది సజీవంగా బయటకు తీశారు. స్థానిక నివాసితుల సహాయంతో జాతీయ రక్షకులు శిథిలాల నుంచి మహిళను బయటకు తీస్తున్నట్లు చూపించే వీడియోను టర్కిష్ స్టేట్ మీడియా ఏజెన్సీ పోస్ట్ చేసింది.
మూడు శక్తివంతమైన భూకంపాలు టర్కీ, సిరియాలలో విధ్వంసం సృష్టించాయి. పెద్ద పెద్ద భవనాలన్నీ పేక మేడల్లా కూలిపోయాయి. ఈ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం రెస్క్యూ సిబ్బంది శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. అయితే రెస్క్యూ బృందాలకు శిథిలాల మధ్య ఒక మహిళను సజీవంగా గుర్తించాయి. వెంటనే రెస్క్యూ సిబ్బంది శిధిలాలను మెల్లగా తొలగించి ఆ మహిళను బయటకు తీసి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్థానిక నివాసితుల సహాయంతో రెస్క్యూ సిబ్బంది శిథిలాల నుంచి మహిళను బయటకు తీస్తున్న వీడియోను టర్కిష్ స్టేట్ మీడియా ఏజెన్సీ పోస్ట్ చేసింది.
సోమవారం ఉదయం సంభవించిన మొదటి భూకంపం టర్కీ చరిత్రలోనే అతి పెద్ద భూకంపం కావడం గమనార్హం. గడిచిన 100 సంవత్సరాలలో ఇదే అతి పెద్ద భూకంపం అని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. టర్కీలో, సిరియన్ శరణార్థులు ఉన్న నగరాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. వందల సంఖ్యలో భారీ బిల్డింగ్‌లు కూలిపోవడం, మంచు ఎక్కువగా ఉండటంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. పైగా అర్ధరాత్రి కావడంతో ప్రజలంతా గాఢనిద్రలో ఉన్నారు. దీంతో బయటకు పరుగులు తీసేందుకు కూడా వీల్లేకుండా పోయింది.
Updated Date - 2023-02-07T12:24:06+05:30 IST