ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MPs Suspension: మరో ఇద్దరు ఎంపీలను సస్పెండ్ చేసిన లోక్‌సభ స్పీకర్.. మండిపడ్డ ప్రతిపక్షాలు

ABN, Publish Date - Dec 20 , 2023 | 03:15 PM

లోక్ సభలో సరైన ప్రవర్తన లేని కారణంగా మరో ఇద్దరు సభ్యులను స్పీకర్ ఓంబిర్లా(OM Birla) ఇవాళ సస్పెండ్ చేశారు. వారిలో కేరళ(Kerala)కు చెందిన థామస్ చజికదన్, సీపీఎం(CPM)కు చెందిన ఆరిఫ్ లు ఉన్నారు.

ఢిల్లీ: లోక్ సభలో సరైన ప్రవర్తన లేని కారణంగా మరో ఇద్దరు సభ్యులను స్పీకర్ ఓంబిర్లా(OM Birla) ఇవాళ సస్పెండ్ చేశారు. వారిలో కేరళ(Kerala)కు చెందిన థామస్ చజికదన్, సీపీఎం(CPM)కు చెందిన ఆరిఫ్ లు ఉన్నారు. తాజా సస్పెన్షన్ తో ఈ సెషన్లో సస్పెండ్ అయిన వారి సంఖ్య 143కి చేరింది.

పార్లమెంట్‌లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం మంగళవారం కూడా జరిగింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ నేతలు శశిథరూర్‌, కార్తీ చిదంబరం, మనీష్‌ తివారీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, సమాజ్‌వాదీ ఎంపీ డింపుల్‌ యాదవ్‌ సహా 49 మందిని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్‌ చేశారు.

పార్లమెంట్‌లో ఈ సెషన్‌లో సస్పెండైన వారి సంఖ్య 143కి చేరింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ ఎలా చేస్తారంటూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలు తెలుపుతున్నారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 20 , 2023 | 03:15 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising