భూమి దిశగా భారీ గ్రహశకలం!
ABN, First Publish Date - 2023-10-05T02:29:42+05:30
మన భూమిని అత్యంత శక్తిమంతమైన భారీ గ్రహశకలం ఢీ కొట్టే అవకాశం ఉందా? ఢీకొంటే గనక ఆ ధాటికి భూమ్మీద పెను వినాశనం తప్పదా? అవుననే అంటున్నారు..
న్యూఢిల్లీ, అక్టోబరు 4: మన భూమిని అత్యంత శక్తిమంతమైన భారీ గ్రహశకలం ఢీ కొట్టే అవకాశం ఉందా? ఢీకొంటే గనక ఆ ధాటికి భూమ్మీద పెను వినాశనం తప్పదా? అవుననే అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు! అలా అని ఇప్పుడప్పుడే కాదు.. ఓ 159 ఏళ్ల తర్వాత! అంతరిక్షంలో 1999లో బెన్నూ గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూ కక్షలోకి ప్రవేశించవచ్చునని, 2182 సెప్టెంబరు 24వ తేదీన భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. న్యూయార్క్‌లోని 102 అంతస్తుల ఎత్తుగల ‘ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’ భవనం స్థాయిలో 1610 అడుగుల వెడల్పుగల ఈ గ్రహశకలం భారీగా ఉంటుందని, ఒకవేళ ఇది భూమిని ఢీకొడితే 1200 మెగా టన్నుల శక్తి విడుదలవుతుందని.. అది అంత్యంత శక్తిమంతమైన అణ్వాయుధం కన్నా 24రెట్లు తీవ్రతతో ఉంటుందని పేర్కొన్నారు!
Updated Date - 2023-10-05T02:29:46+05:30 IST