ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs Bharat: ఇండియా vs భారత్ వివాదం.. ఈ 10 దేశాలు తమ పేర్లు మార్చుకున్నాయి.. అవేంటో తెలుసా?

ABN, First Publish Date - 2023-09-06T21:42:25+05:30

రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించనున్న జి20 సమ్మిట్ విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొనడం.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశం పేరుని..

రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించనున్న జి20 సమ్మిట్ విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొనడం.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశం పేరుని ఇండియా నుంచి భారత్‌గా మారుస్తున్నారా? అని అనుమానాలు రేకెత్తాయి. ఇదే సమయంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనుండటంతో.. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దేశం పేరుని ‘భారత్‌’గా మార్చే తీర్మానాన్ని తీసుకురావచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే.. ఇండియా పేరుని మారుస్తారా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు కానీ.. కొన్ని దేశాలు మాత్రం రాజకీయ, సామాజిక లేదా ఇతర కారణాల వల్ల తమ పేర్లను మార్చుకున్నాయి.


ఆ దేశాలేమిటంటే..

* టర్కీ టు తుర్కియే: 2022లో తమ దేశం పేరుని టర్కీ నుంచి తుర్కియేగా మార్చుకుంటున్నట్టు ఆ దేశం ఐక్యరాజ్య సమితికి తెలియజేసింది. తుర్కియే అనే పేరు తమ దేశ సంస్కృతి, నాగరికత, విలువలను ప్రతిబింబజేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు.

* హాలండ్ టు నెదర్లాండ్స్: తమ గ్లోబల్ ఇమేజ్‌ని నవీకరించే లక్ష్యంతో హాలండ్ దేశం తన పేరుని నెదర్లాండ్స్‌గా మార్చుకుంది. ఈ పేరు మార్పుతో.. సరికొత్త ఆవిష్కరణలు, యునిటీకి తమ దేశం ప్రాధాన్యత ఇస్తుందని ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని భావిస్తోంది.

* బర్మా టు మయన్మార్: బర్మా దేశం తన పేరుని మయన్మార్‌గా 1989లో మార్చుకుంది. బర్మన్ జాతికి చెందిన సమూహం ఆధిపత్యం చెలాయించడంతో.. ఈ దేశం చాలాకాలం పాటు బర్మాగా పిలువడింది.

* సేలోన్ టు శ్రీలంక: గతంలో సిలోన్ అని పిలువబడే ఈ ద్వీప దేశం.. దాని సాంస్కృతిక మూలాలను నొక్కి చెప్పడానికి, అలాగే పోర్చుగీస్ - బ్రిటిష్ పాలన చారిత్రక అవశేషాలను తొలగించడానికి శ్రీలంకగా పేరు మార్చబడింది. అయితే, సిలోన్ అనే పేరు 2011 వరకు ప్రభుత్వ ఉపయోగంలో కొనసాగింది.

* పర్షియా నుండి ఇరాన్: ప్రస్తుత ఆధునిక ఇరాన్ 1935 వరకు పర్షియా అని పిలువబడింది. అయితే.. కొత్త ప్రారంభానికి గుర్తుగా రాజు రెజా షా ‘పర్షియా’ పేరుని ఇరాన్‌గా మార్చాడు. ఏదేమైనా.. ఆహారం, కళ, సాహిత్యం వంటి దీర్ఘకాల సాంస్కృతిక ఎగుమతులు పర్షియన్‌గానే సూచించబడుతున్నాయి.

* సియామ్ టు థాయిలాండ్: థాయిలాండ్‌ను 1939 వరకు సియామ్‌గా పిలిచేవారు. ఆ తర్వాత దేశపు స్వాతంత్ర్యాన్ని నొక్కిచెప్పడానికి, థాయ్ ప్రజల జాతీయ గర్వాన్ని సూచించడానికి కొత్త పేరుని ఎంపిక చేయబడింది.

* చెక్ రిపబ్లిక్ టు చెకియా: గతంలో చెక్ రిపబ్లిక్‌గా పిలువబడిన ఈ దేశం 2016లో తన పేరును చెకియాగా మార్చుకుంది. పేరులో సరళత కోసం, క్రీడా ఈవెంట్‌లతో పాటు మార్కెటింగ్ ప్రయత్నాల్లో తమ దేశం గుర్తింపుని సులభతరం చేసేందుకు చెకియాగా పేరు మార్చారు.

* కేప్ వెర్డే నుండి రిపబ్లిక్ ఆఫ్ కేబో వెర్డే: ఈ కేప్ వెర్డే దేశం 2013లో పూర్తి పోర్చుగీస్ స్పెల్లింగ్‌ను స్వీకరించి.. రిపబ్లిక్ ఆప్ కేబో వెర్డేగా తన పేరు మార్చుకుంది.

* డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో: 1997 వరకు ఈ దేశం కాంగో ఫ్రీ స్టేట్, బెల్జియన్ కాంగో, కాంగో-లియోపోల్డ్‌విల్లే, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రిపబ్లిక్ ఆఫ్ జైర్‌గా పిలువబడింది. చివరికి 1997లో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా తన పేరుని ఫిక్స్ చేసుకుంది.

*స్వాజిలాండ్ టు ఈశ్వతిని : గతంలో ఈ దేశం కింగ్‌డమ్ ఆఫ్ స్వాజిలాండ్‌గా పిలువబడేది. అయితే.. 2018లో కింగ్ ఎంస్వతి III ఈ దేశం పేరుని ఈశ్వతినిగా మార్చారు.

Updated Date - 2023-09-06T21:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising