బాబు పిటిషన్‌ను నేడు ప్రస్తావించండి
ABN, First Publish Date - 2023-09-26T02:27:52+05:30
తనపై నమోదైన కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ అధినేత..
సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సూచన
అత్యవసరంగా విచారించాలి
ఏపీలో విపక్షాన్ని అణగదొక్కుతున్నారు
సీనియర్ న్యాయవాది లూథ్రా వెల్లడి
బాబు ఎప్పటి నుంచి కస్టడీలో ఉన్నారని
ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి
ఈ నెల 8న అరెస్టు చేశారన్న లూథ్రా
చంద్రబాబు చేసిన తప్పేంటి?
అనుక్షణం ప్రజల కోసం పనిచేయడమే నేరమా?
ప్రజల సొమ్ము తినాల్సిన అవసరం మాకు లేదు
హెరిటేజ్‌లో 2శాతం అమ్మితే రూ.400కోట్లు వస్తాయి
జగ్గంపేట టీడీపీ సభలో భువనేశ్వరి వ్యాఖ్యలు
బాబు బెయిల్, కస్టడీపై విచారణ నేటికి వాయిదా
బాబు పిటిషన్‌ను నేడు ప్రస్తావించండి
సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సూచన
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తనపై నమోదైన కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మంగళవారం ప్రస్తావించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సోమవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ‘చంద్రబాబు కస్టడీలో ఉన్నారు. అత్యవసరంగా విచారణ జరపాలి. ఇది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేసు. అక్కడ ప్రతిపక్షాన్ని అణచివేస్తున్నారు’ అని తెలిపారు. ఆయన ఎంత కాలం నుంచి కస్టడీలో ఉన్నారని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించగా.. ఈ నెల 8వ తేదీన అరెస్టు చేశారని లూథ్రా బదులిచ్చారు. అయితే ఈ పిటిషన్ సోమవారంనాటి ప్రస్తావనల జాబితాలో లేదని, మంగళవారం ఆ జాబితాలో చేర్పించి తమ ముందు ప్రస్తావించాలని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా.. రాజకీయ దురుద్దేశంతో తనపై కేసు నమోదు చేశారని, రిమాండ్ రిపోర్టులో ఎటువంటి ఆధారాలు చూపించకుండా అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు శనివారం దాఖలుచేసిన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) ప్రకారం కేసు నమోదుకు గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదన్నారు.
Updated Date - 2023-09-26T02:27:52+05:30 IST