ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

G20 Summit : జీ20 దేశాల కళాఖండాలతో డిజిటల్ మ్యూజియం!

ABN, First Publish Date - 2023-09-02T15:41:11+05:30

‘ఒక భూమి-ఒకే కుటుంబం’ ఇతివృత్తంతో జరుగుతున్న జీ20 సదస్సు చిరకాలం గుర్తుండిపోయేలా చేయడం కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ గ్రూప్‌లోని 20 దేశాలకు సంబంధించిన కనీసం ఒక కళాఖండం ఉండేలా ఓ డిజిటల్ మ్యూజియంను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది.

న్యూఢిల్లీ : ‘ఒక భూమి-ఒకే కుటుంబం’ ఇతివృత్తంతో జరుగుతున్న జీ20 సదస్సు చిరకాలం గుర్తుండిపోయేలా చేయడం కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ గ్రూప్‌లోని 20 దేశాలతోపాటు ఈ సదస్సుకు హాజరవుతున్న తొమ్మిది అతిథి దేశాలకు సంబంధించిన కనీసం ఒక కళాఖండం ఉండేలా ఓ డిజిటల్ మ్యూజియంను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ మ్యూజియాన్ని ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే జీ20 దేశాధినేతల సమావేశం సందర్భంగా ప్రారంభించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

16వ శతాబ్దంనాటి మోనాలిసా డిజిటల్ నమూనా కూడా ఈ మ్యూజియంలో భాగం కాబోతోందని తెలుస్తోంది. లియోనార్డో డావిన్సీ మాస్టర్‌పీస్ అయిన మోనాలిసా ప్రస్తుతం పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ఉంది. ‘ముత్యం పొదిగిన కర్ణాభరణం’ తైల వర్ణ చిత్రం కూడా జీ20 డిజిటల్ మ్యూజియంలో అలరించబోతోందని సమాచారం. డచ్ కళాకారుడు జొహన్నెస్ వెర్మీర్ గీసిన ఈ చిత్రం ప్రస్తుతం నెదర్లాండ్స్ మ్యూజియంలో ఉంది.


ఈ డిజిటల్ మ్యూజియంలో భౌతికంగా కనిపించే కళాఖండాలతోపాటు డిజిటల్ రూపంలో కనిపించే కళాఖండాలు కూడా ఉంటాయి. అందుకే దీనిని ఫిజిటల్ (phygital) మ్యూజియం అని పిలుస్తున్నారు.

జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రులు వారణాసిలో ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘సుర్ వసుధ’ పేరుతో నిర్వహించిన జీ20 ఆర్కెస్ట్రా వీరిని మంత్రముగ్ధులను చేసింది.

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగల దేశాల ఇంటర్‌గవర్నమెంటల్ ఫోరం జీ20. దీనిలోని సభ్య దేశాలు రొటేషన్ పద్ధతిలో ఒక్కొక్క సంవత్సరం దీనికి ఆతిథ్యం ఇస్తూ ఉంటాయి. దీనిలో సభ్యత్వం ఉన్న దేశాల్లో... అర్జంటైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత దేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, ది రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి. ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే జీ20 దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరవుతున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరుకావడం లేదు. ఈ సదస్సుకు అతిథులుగా వస్తున్న దేశాలు... బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యూఏఈ.


ఇవి కూడా చదవండి :

Supreme Court : తల్లిదండుల పెళ్లి చెల్లకపోయినా పిల్లలకు వారసత్వ హక్కు ఉంటుంది : సుప్రీంకోర్టు

RSS : మన దేశాన్ని ‘భారత్’ అని పిలవాలి : మోహన్ భగవత్

Updated Date - 2023-09-02T15:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising