Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండ్ అయింది.. చందమామపై నెక్ట్స్ ఏం జరగబోతోందంటే..
ABN, First Publish Date - 2023-08-23T20:25:13+05:30
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. జాబిల్లిపై భారత్ జెండా పాతింది. అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. చంద్రయాన్-3 జాబిల్లిపై అడుగుపెట్టింది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ అయింది. 40 రోజులు ప్రయాణించి చంద్రయాన్-3 జాబిల్లిపై దిగింది. ఇప్పుడు ‘వాట్ నెక్ట్స్’ అనే ప్రశ్న చాలామందిలో ఉత్సుకత రేకెత్తిస్తోంది.
చంద్రయాన్-3 ప్రయోగం (Chandrayaan 3) విజయవంతమైంది. జాబిల్లిపై భారత్ జెండా పాతింది. అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. చంద్రయాన్-3 జాబిల్లిపై అడుగుపెట్టింది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ అయింది. 40 రోజులు ప్రయాణించి చంద్రయాన్-3 జాబిల్లిపై దిగింది. ఇప్పుడు ‘వాట్ నెక్ట్స్’ అనే ప్రశ్న చాలామందిలో ఉత్సుకత రేకెత్తిస్తోంది. ఇంకొన్ని గంటల్లో ల్యాండర్‌లోని రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు చేస్తుందని ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. వెంటనే ల్యాండర్ నుంచి రోవర్ ఎందుకు బయటకు రాదంటే.. 10 మీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ కిందికి జారిపడినప్పుడు ఆ తాకిడికి పైకి లేచిన చంద్రధూళి సర్దుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది. అంతా సద్దుమణిగాక.. ల్యాండర్‌లోని రోవర్ బయటకు వస్తుంది. అప్పుడు ఆ రెండూ పరస్పరం ఫొటోలు తీసుకుని భూమికి పంపుతాయి. రెండూ సురక్షితంగా ఉన్నాయనడానికి ఆ ఫొటోలే నిదర్శనం. దీంతో చంద్రయాన్-3 పూర్తిగా సఫలమైనట్టు లెక్క.
చంద్రయాన్-3 కోసం ఇస్రో రూ.615 కోట్లు ఖర్చు చేసింది. 3.84 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి జాబిల్లిపై చంద్రయాన్-3 దిగింది. చంద్రుడి ఉపరితలాన్ని చంద్రయాన్-3 క్షుణ్ణంగా పరిశీలించనుంది. చంద్రుడి నిర్మాణం, పరిమాణం, వాతావరణంపై అధ్యయనం చేయనుంది. 14 రోజుల పాటు చంద్రుడిపై రోవర్ ప్రజ్ఞాన్ పరిశోధనలు కొనసాగనున్నాయి. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇటీవల చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్‌లో రష్యా విఫలమైంది. చంద్రుడిపై ఇప్పటి వరకు 12 దేశాల నుంచి 141 ప్రయత్నాలు జరిగాయి. చంద్రయాన్-3 ఘన విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.
ఇస్రో దక్షిణ ధ్రువాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడ నీటి జాడలు ఉన్నట్టు భావిస్తుండడమే. ఆ ప్రాంతంలో మంచు స్ఫటికాల రూపంలో నీటి నిల్వలున్నాయని నాసా కూడా గుర్తించింది. దక్షిణ ధ్రువంపై గురుత్వాకర్షణ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ వెలుతురు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు మైనస్‌లో ఉంటాయి. కాబట్టి అక్కడ నీరు ఉండే అవకాశం ఉంటుంది. ఇస్రో అంచనా ప్రకారం అక్కడ పది కోట్ల టన్నుల మేర నీరు ఉండొచ్చు. నీరు ఉన్న చోట మనిషి నివసించగలడు. కాబట్టి భవిష్యత్తులో చంద్రునిపై పరిశోధనలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఇక్కడ రాళ్లు, శిలలు తక్కువగా ఉంటాయి. దీంతో ల్యాండర్ దిగడానికి కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఇస్రో అంచనా వేసినట్టుగానే ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంలో సురక్షితంగా దిగింది.
Updated Date - 2023-08-23T20:25:16+05:30 IST