ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Corona Virus: కేరళలో కరోనా కొత్త వేరియంట్.. మునుపటి వాటి కంటే చాలా భిన్నం.. పెరుగుతున్న కేసులు

ABN, Publish Date - Dec 16 , 2023 | 06:22 PM

కరోనా వైరస్ ఇప్పుడప్పుడే విడిచిపెట్టేలా కనిపించడం లేదు. రెండు సుదీర్ఘమైన లాక్‌డౌన్‌ల తర్వాత దాని ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే.. కొత్త వేరియంట్లతో అది కంగారు పెట్టిస్తూనే ఉంది. ఒకదాని తర్వాత మరొక కొత్త వేరియంట్లతో...

COVID Subvariant JN1 In Kerala: కరోనా వైరస్ ఇప్పుడప్పుడే విడిచిపెట్టేలా కనిపించడం లేదు. రెండు సుదీర్ఘమైన లాక్‌డౌన్‌ల తర్వాత దాని ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే.. కొత్త వేరియంట్లతో అది కంగారు పెట్టిస్తూనే ఉంది. ఒకదాని తర్వాత మరొక కొత్త వేరియంట్లతో తన కోరల్ని చాచుతూ.. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు తాజాగా JN.1 అనే మరో కొత్త సబ్‌వేరియెంట్ పుట్టుకొచ్చింది. చైనాలో ఈ కొత్త వేరియంట్ కేసులు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇది భారత్‌లోనూ చొరబడింది. BA.2.86కి సబ్‌వేరియంట్ అయిన JN.1 కేసు డిసెంబర్ 8వ తేదీన కేరళలో కనుగొనబడింది. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

రిపోర్ట్స్ ప్రకారం.. నవంబర్ 18వ తేదీన 79 ఏళ్ల మహిళ నుండి వచ్చిన నమూనా RT-PCR పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఆమెకు ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యాల (ILI) తేలికపాటి లక్షణాలు ఉన్నాయని.. మెల్లగా కొవిడ్-19 నుండి కోలుకున్నట్టు తెలిసింది. అంతకుముందు.. సింగపూర్‌లో ఉన్న ఒక భారతీయు యాత్రికుడు కూడా JN.1 సబ్-వేరియంట్ బారిన పడ్డాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన ఆ వ్యక్తి.. అక్టోబర్ 25వ తేదీన సింగపూర్‌కు వెళ్లాడు. అయితే.. స్థానికంగా గానీ, తమిళనాడు రాష్ట్రంలో గానీ ఈ వేరియెంట్ కేసులేమీ నమోదు అవ్వలేదని రిపోర్ట్స్ వెల్లడించాయి. ‘‘భారతదేశంలో JN.1 వేరియంట్‌కి చెందిన ఇతర కేసులేమీ కనుగొనబడలేదు’’ యొక్క ఇతర కేసు ఏదీ కనుగొనబడలేదు’’ అని ఓ నివేదిక పేర్కొంది.


ఈ కొత్త వేరియంట్ గురించి INSACOG చీఫ్ NK అరోరా మాట్లాడుతూ.. ఈ JN.1 అనేది BA.2.86 సబ్‌ వేరియంట్ అని, తమ వద్ద కొన్ని JN.1 కేసులు ఉన్నాయని అన్నారు. ఈ కొత్త వేరియంట్ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉందని, ఇప్పటివరకు తీవ్రమైన వ్యాధి నివేదించబడలేదని అన్నారు. నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో-ఛైర్మన్ రాజీవ్ జయదేవన్ ప్రకారం.. ఏడు నెలల విరామం తర్వాత భారత్‌లో కేసులు పెరుగుతున్నాయన్నారు. కేరళలో ప్రజలు కోవిడ్ బారిన పడినట్లు నివేదికలు ఉన్నాయని.. మునుపటిలాగే తీవ్రత కనిపిస్తోందని చెప్పారు. ఈ JN.1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని.. ఇది రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోగలదని ఆయన పేర్కొన్నారు.

‘‘JN.1 అనేది రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్. ఇతర వేరియెంట్లతో పోలిస్తే ఇది చాలా భిన్నమైనది. గతంలో కొవిడ్ బారిన పడిన వ్యక్తులకు, టీకాలు వేయించుకున్న వారికి కూడా సోకే అవకాశం ఉంది’’ అని రాజీవ్ జయదేవన్ కుండబద్దలు కొట్టారు. కాబట్టి.. చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. దీని నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి రాలేదు. కొవిడ్ 19 లక్షణాలే ఈ వేరియంట్‌కు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

Updated Date - Dec 16 , 2023 | 06:22 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising