ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DK Shivakumar: కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర జరుగుతోంది.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-10-18T23:36:21+05:30

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ భారీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గాను బీజేపీకి..

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ భారీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గాను బీజేపీకి చెందిన ఒక బృందం క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని కుండబద్దలు కొట్టారు. తమను ఎవరు సంప్రదిస్తున్నారో, తమని ఊరించేందుకు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారో తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తెలియజేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీకి చెందిన ఒక ప్రత్యేక బృందం కుట్ర పన్నుతోందన్న వాదనలపై డీకే శివకుమార్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆయన బదులిస్తూ.. ‘‘అవును, ఇది ముమ్మాటికీ నిజం. ఓ బీజేపీ బృందం మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. మా ఎమ్మెల్యేలందరూ తమని ఎవరు కలుస్తున్నారో, వారికి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారో నాతో పాటు ముఖ్యమంత్రికి పూర్తి సమాచారం ఇస్తున్నారు. అన్ని విషయాలపై మా వద్ద పక్కా సమాచారం ఉంది. అయితే, ఈ విషయాలన్నీ ఇప్పుడు కాదు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు స్వయంగా మా ఎమ్మెల్యేల చేతనే ఆ వివరాలన్నింటిని బయటపెట్టిస్తాం’’ అని పేర్కొన్నారు. సింగపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని గతంలోనూ శివకుమార్ ఆరోపణలు చేశారు.

ఇదే సమయంలో.. ప్రజాపనుల శాఖ మంత్రి, కెపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సతీష్‌ జార్కిహోళికి తనకు మధ్య విభేదాలు వచ్చినట్లు వచ్చిన వార్తలను శివకుమార్‌ ఖండించారు. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. మంగళవారమే తాను సతీష్‌ని కలిశానని.. తమ మధ్య సుదీర్ఘ చర్చ సాగిందని అన్నారు. ఎమ్మెల్యేలను టూర్‌కి తీసుకెళ్తున్న యోచన ఆయన తనకు చెప్పారని.. దాని గురించి తాము చాలాసేపు మాట్లాడుకున్నామని అన్నారు.

Updated Date - 2023-10-18T23:36:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising