ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Elections: మాజీ సీఎం పోటీచేసే నియోజకవర్గం ఏదో తేలిపోయింది...

ABN, First Publish Date - 2023-03-25T11:06:09+05:30

మైసూరు జిల్లా వరుణ నుంచే పోటీ చేసే ఆలోచనలో ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Siddaramaiah) ఉన్నారు. ఇదే విషయాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మైసూరు జిల్లా వరుణ నుంచే పోటీ చేసే ఆలోచనలో ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Siddaramaiah) ఉన్నారు. ఇదే విషయాన్ని చిత్రదుర్గలో సూత్రప్రాయంగా తెలిపారు. బాగల్‌కోటె జిల్లాకు వెళుతుండగా చిత్రదుర్గలో అభిమానులు పెద్దఎత్తున స్వాగతించారు. ఇదే సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన వరుణ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులు కూడా వరుణ నుంచే పోటీ చేయాలని సూచించారన్నారు. వరుణ టికెట్‌ ఇవ్వాలని పార్టీ పెద్దలకు వివరించానన్నారు. మరో చోట కూడా పోటీ చేసే ఆలోచన ఉందన్నారు. 25 నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలంటూ ఆహ్వానిస్తున్నారని తెలిపారు. తుది నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుందన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం గడిచిన కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు దాదాపు తెరపడినట్లయింది. కానీ రెండు చోట్ల పోటీ చేస్తానని సిద్దరామయ్య అభిప్రాయం మేరకు మరో నియోజకవర్గం ఏదనేది కుతూహలంగా మారింది. కుమారుడు యతీంద్ర(Yatindra) రాజకీయ భవిష్యత్తుకు భంగం కలగనుందనే వరుణ నుంచి పోటీ చేసేందుకు సిద్దరామయ్య వెనకడుగు వేశారు. కానీ పార్టీ ముఖ్యుల సలహా మేరకు వరుణ నుంచి బరిలోకి దిగేందుకు అంగీకరించినట్లు సమాచారం. వరుణ నుంచి సిద్దరామయ్య బరిలోకి నిలవడం దాదాపు ఖరారు కావడంతో ఆయనకు ధీటైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. లింగాయత సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు బరిలో ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యడియూరప్ప(Yeddyurappa) కుమారుడు విజయేంద్ర లేదా మంత్రి సోమణ్ణలో ఒకరు ఉంటారని తెలుస్తోంది. తాజాగా శుక్రవారం యడియూరప్ప నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అల్పాహార విందుకు వచ్చిన వేళ విజయేంద్రకు ప్రాధాన్యత ఇచ్చిన అంశం కూడా హల్‌చల్‌ చేస్తోంది. ఇదే విషయమై విజయేంద్ర మీడియాతో మాట్లాడుతూ వరుణ నుంచి పోటీ చేయాలనే అంశం అధిష్టాన నిర్ణయమన్నారు.

Updated Date - 2023-03-25T11:06:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising