ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3 : చంద్రయాన్-3 లాంచ్ ప్యాడ్‌ను నిర్మించిన ఇంజినీర్లకు ఏడాది నుంచి జీతాల్లేవా?.. ఇది నిజమేనా?..

ABN, First Publish Date - 2023-08-24T12:36:59+05:30

చంద్రయాన్-3 విజయవంతమైన తరుణంలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన లాంచ్ ప్యాడ్‌ను నిర్మించిన ఇంజినీర్లకు దాదాపు 17 నెలల నుంచి జీతాలు అందడం లేదని కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఏ మేరకు ఉందో తెలియడం లేదు.

న్యూఢిల్లీ : చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతమైన నేపథ్యంలో ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. లాంచ్ ప్యాడ్‌ను నిర్మించిన ఇంజినీర్లకు దాదాపు 17 నెలల నుంచి జీతాలు అందడం లేదనేది ఆ వార్త సారాంశం. ఈ మేరకు ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తల్లో వాస్తవం ఏ మేరకు ఉందో తెలియడం లేదుని గానీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఓ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాంచీలోని హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ (HEC) ఇంజినీర్లకు 17 నెలల నుంచి జీతాలు అందడం లేదట. జీతాలు ఇవ్వకపోయినప్పటికీ, ఈ సంస్థ చంద్రయాన్-3 కోసం మొబైల్ లాంచింగ్ ప్యాడ్, ఇతర అత్యంత ముఖ్యమైన పరికరాలను ఇస్రోకు (భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు) గత ఏడాది అందజేసిందని సదరు రిపోర్ట్ తెలిపింది.


భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో హెచ్ఈసీ పని చేస్తోంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థ రాంచీలోని ధుర్వా ప్రాంతంలో ఉంది. ఈ సంస్థలో పని చేస్తున్న 2,700 మంది వర్క్‌మెన్, 450 మంది ఎగ్జిక్యూటివ్‌లకు జీతాలు అందలేదని రిపోర్ట్ తెలిపింది. ఉన్నత స్థాయిలో పని చేస్తున్నవారికి ఓ సంవత్సరం నుంచి, సాధారణ ఉద్యోగులకు దాదాపు ఎనిమిది నెలల నుంచి జీతాలు అందడం లేదని పేర్కొంది.

ఇస్రో, రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వేలు, కోల్ ఇండియా, స్టీల్ రంగాల నుంచి దాదాపు రూ.1,500 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చినప్పటికీ, నిధుల కొరత వల్ల 80 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయని ఓ మీడియా సంస్థ తెలిపింది. రూ.1,000 కోట్లు వర్కింగ్ కేపిటల్ ఇవ్వాలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖను హెచ్ఈసీ కోరినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపింది.

హెచ్ఈసీ ఇంజినీరు ఒకరు ఆ మీడియా సంస్థతో మాట్లాడుతూ, చంద్రయాన్-3 విజయవంతమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమకు గర్వకారణమని చెప్పారు. దేశంలో చాలా ముఖ్యమైన ప్రాజెక్టులో భాగస్వాములమైనందుకు సంతోషంగా ఉందన్నారు. మరోవైపు హెచ్ఈసీకి శాశ్వత చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిని రెండున్నరేళ్ల నుంచి భర్తీ చేయడం లేదని ఆ మీడియా సంస్థ తెలిపింది.

అయితే ఈ వార్తల్లో వాస్తవాలను నిర్థారించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :

Chandrayaan-3 : మధ్య తరగతి ప్రజల్లో ఆశలు రేపుతున్న చంద్రయాన్-3 విజయం

Russia : పుతిన్‌పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ చీఫ్ ఓ చిల్లర దొంగ!

Updated Date - 2023-08-24T13:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising