ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు చేరుకున్న అయిదో విమానం

ABN, First Publish Date - 2023-10-18T09:14:57+05:30

ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆపరేషన్ అజయ్(Operation Ajay) పేరుతో చేపట్టిన ఈ తరలింపు ప్రక్రియలో భాగంగా ఇజ్రాయెల్(Israeil) నుంచి భారత్ కు అయిదో విమానం ఢిల్లీ విమానాశ్రయానికి(Delhi Airport) చేరుకుంది. ఇందులో మొత్తం 286 మంది ప్రయాణికులున్నారు.

ఢిల్లీ: ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆపరేషన్ అజయ్(Operation Ajay) పేరుతో చేపట్టిన ఈ తరలింపు ప్రక్రియలో భాగంగా ఇజ్రాయెల్(Israeil) నుంచి భారత్ కు అయిదో విమానం ఢిల్లీ విమానాశ్రయానికి(Delhi Airport) చేరుకుంది. ఇందులో మొత్తం 286 మంది ప్రయాణికులున్నారు. 18 మంది నేపాలియన్లు సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే భారత్ వచ్చిన 4 విమానాల్లో వెయ్యికి పైగా ఇండియన్స్ తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్ లో 18 వేలకు పైగా భారతీయులు నివసిస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ అజయ్ లో భాగంగా వచ్చిన ప్రయాణికులకు కేంద్ర సహాయ మంత్రి మురుగన్ స్వాగతం పలికారు. వీరిలో కేరళకు చెందిన వారు 22 మంది ఉన్నారు. అయితే స్పైస్‌జెట్() విమానం A340 టెల్ అవీవ్‌లో ల్యాండ్ అయిన తర్వాత సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. దీంతో విమానాన్ని జోర్డాన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి భారత్ కు సేఫ్ గా తిరిగి వచ్చింది.


ఇజ్రాయెల్-హమాస్(Hamas) ల మధ్య జరుగుతున్న భీకర పోరులో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలోని ఓ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ జరిపిన ఏరియల్‌ దాడుల్లో 500 మంది మృతిచెందారు. గాజాలోని అల్‌-అహ్లీ బాప్టిస్ట్‌ ఆస్పత్రిపై మంగళవారం సాయంత్రం బాంబు దాడులు జరిగినట్లు హమాస్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్‌ వరుస దాడుల నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకాలేర్పడుతున్నాయని ఆరోపించింది. అయితే.. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) వర్గాలు దీన్ని ఖండించాయి. ఆస్పత్రిలో దాచిన మందుగుండు వల్ల నష్టం జరిగి ఉంటుందని వ్యాఖ్యానించాయి. మరోవైపు ఇజ్రాయెల్‌ అల్టిమేటం మేరకు గాజాలోని 10 లక్షల మంది పాలస్తీనియన్లు దక్షిణ ప్రాంతానికి చేరుకోగా.. ఐడీఎఫ్‌ మంగళవారం ఉదయం నుంచి సెంట్రల్‌ గాజాపై ఏరియల్‌ స్ట్రైక్స్‌ను పెంచింది. దాడుల్లో 88 మంది పౌరులు, వైద్యులు, వైద్య సిబ్బంది చనిపోయారని హమాస్‌ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటి వరకు 2,778 మంది పౌరులు చనిపోయారని, వారిలో మూడింట రెండొంతుల మంది మహిళలు, చిన్నారులేనని వివరించాయి. ఇజ్రాయెల్‌లోనూ మరణాల సంఖ్య 1,400గా ఉందని ఐడీఎఫ్‌ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-10-18T09:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising