ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former CM: పూర్తి మెజార్టీ ఇస్తే ప్రజారంజక పాలన

ABN, First Publish Date - 2023-01-31T11:40:07+05:30

రానున్న శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తనకు సంపూర్ణ మెజార్టీ ఇస్తే ఐదేళ్ల పాటు ప్రజారంజక పాలనను అందిస్తానని మాజీ ముఖ్యమం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మాజీ సీఎం కుమారస్వామి

రాయచూరు(బెంగళూరు), జనవరి 30 : రానున్న శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తనకు సంపూర్ణ మెజార్టీ ఇస్తే ఐదేళ్ల పాటు ప్రజారంజక పాలనను అందిస్తానని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy) పేర్కొన్నారు. పంచరత్న యాత్ర చివరి రోజు సోమవారం జిల్లాలోని సింధనూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కుమారస్వామి ప్రసంగించారు. తన వద్దకు వచ్చిన వారంతా నిరుపేదలేనని వారి సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో కృషి చేస్తానన్నారు. ధనిక, పేద తేడా లేకుండా అందరికి హైటెక్‌ విద్య, ఆరోగ్యం, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, రైతు పండించిన పంటకు మద్దతు ధర, సాగు భూములకు నీరు, నిరంతరం విద్యుత్‌ అన్న లక్ష్యాలే తమ పాలనకు గీటురాళ్లుగా ఉంటాయన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా పని చేసిన రెండు సమయాల్లోను పూర్తి మెజార్టీ లేక మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చిందని వివరించారు. రాజకీయంగా తాను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణ మాఫీ చేశానని, అదే స్ఫూర్తితో రైతు ప్రయోజనాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈసారి ప్రజలు తనకు శాసనసభలో పూర్తి మెజార్టీని కట్టబెడితే ఇచ్చిన ప్రతి హామీతో పాటు గతంలో నెరవేర్చలేకపోయిన హామీలను సైతం పూర్తి చేస్తామన్నారు. తమ పార్టీ అభ్యర్థిగా సింధనూరులో తిరిగి వెంకటరావు నాడగౌడ పోటీ చేస్తారని, ప్రజాప్రతినిధి అంటే నాడగౌడలానే ఉండాలంటూ కొనియాడారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ప్రజలకు మెరగైన సేవలందించడంలో వెంకటరావు నాడగౌడ అగ్రభాగాన ఉన్నారన్నారు. తమ పార్టీకి పూర్తి అధికారాన్ని అప్పగించాలని, వెంకటరావు నాడగౌడను ఆశీర్వదించాలని ఆయన ఐదేళ్ల పాటు మంత్రిగా ఉండి మీకు సేవలందిస్తారంటు నియోజక వర్గం ప్రజలకు హామీ ఇచ్చారు.

Updated Date - 2023-01-31T11:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising