Israel Hamas War: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా స్వతంత్ర రాజ్య స్థాపనకు భారత్ మద్దతు
ABN, First Publish Date - 2023-10-12T20:57:35+05:30
శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులు చేయగానే.. ఈ దాడుల్ని ఖండిస్తూ, ఇజ్రాయెల్ భారత్‌కు మద్దతు తెలిపింది. హమాస్ చేసిన ఈ దాడులు తనకు బాధ కలిగించాయని, ఇజ్రాయెల్‌లోని ప్రజలు క్షేమంగా...
శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులు చేయగానే.. ఈ దాడుల్ని ఖండిస్తూ, ఇజ్రాయెల్ భారత్‌కు మద్దతు తెలిపింది. హమాస్ చేసిన ఈ దాడులు తనకు బాధ కలిగించాయని, ఇజ్రాయెల్‌లోని ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని, అన్ని విధాలుగా తాము ఇజ్రాయెల్‌కి అండగా నిలుస్తామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా.. తాము ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తామని, ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌గా మద్దతు తెలుపుతున్నామని కూడా తెలిపారు. ఇప్పుడు పాలస్తీనా స్వతంత్ర రాజ్య స్థాపనకు భారత్ మద్దతు తెలిపింది.
పాలస్తీనా సార్వభౌమాధికారం, స్వతంత్ర, ఆచరనీయమైన రాజ్య స్థాపనకు భారతదేశం దీర్ఘకాల మద్దతును విశ్వసిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం తెలిపారు. ‘‘మా విధానం దీర్ఘకాలంగా, స్థిరంగా ఉంది. పాలస్తీనా సార్వభౌమ, స్వతంత్ర, ఆచరణీయ రాజ్యాన్ని స్థాపించడానికి.. గుర్తింపు పొందిన సరిహద్దులతో ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా ప్రక్క ప్రక్కన నివసించే దిశగా ప్రత్యక్ష చర్చల పునరుద్ధరణను భారతదేశం ఎల్లప్పుడూ సమర్ధిస్తుంది’’ అని ఆయన చెప్పారు. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ చేసిన రాకెట్ దాడుల అనంతరం.. పాలస్తీనా అంశంపై భారత్ చేసిన మొట్టమొదటి ప్రకటన ఇదే.
ఇదే సమయంలో ఇజ్రాయెల్, గాజాలోని మానవతా పరిస్థితి గురించి అడిగినప్పుడు.. మానవతా చట్టాన్ని పాటించడం సార్వత్రిక బాధ్యత అని బాగ్చి చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న సరే, దాంతో పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులను తిరిగి భారత్‌కు తీసుకురావడానికి గురువారం ఇజ్రాయెల్ నుండి మొదటి విమానం ల్యాండ్ అవుతుందన్నారు. చార్టర్డ్ విమానాల జాబితాలో తమ పేర్లను చేర్చుకునేందుకు గాను.. ఇజ్రాయెల్‌లోని భారత పౌరులందరికీ అక్కడున్న భారతదేశం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తాము విజ్ఞప్తి చేసినట్లు కూడా బాగ్చి పేర్కొన్నారు.
ఆయుధాల రూపంలో ఇజ్రాయెల్‌కు భారత్ సహాయం చేస్తుందా? అని ప్రశ్నించినప్పుడు.. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లోని భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని బాగ్చి సమాధానం ఇచ్చారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయులు ఉన్నారని.. అక్కడి పౌరుల్లో ఒకరు గాయపడినట్లు భారత్‌కు సమాచారం అందిందని అన్నారు. తాము వారితో టచ్‌లో ఉన్నామని, గాయపడిన వారు అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. భారతీయుల్లో ఎవరూ మరణించలేదన్న ఆయన.. గాజాలో నలుగురు, వెస్ట్ బ్యాంక్‌లో మరో 12 మంది ఇండియన్స్ ఉన్నారని వివరించారు.
Updated Date - 2023-10-12T20:57:35+05:30 IST